Nagababu: గని మూవీ అందుకే ఆడలేదన్న నాగబాబు!

ప్రముఖ నటుడు నాగబాబు ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు కామెడీ స్టార్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లకు నాగబాబు ధీటుగా సమాధానం ఇస్తారని ఇండస్ట్రీలో పేరుంది. తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన నాగబాబు నెటిజన్ల ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులు ఇవ్వడం గమనార్హం. ఒక నెటిజన్ ఇప్పుడు కానీ గతంలో కానీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని అడగగా నా భార్య అని నాగబాబు సమాధానం ఇచ్చారు.

Click Here To Watch NOW

మరో నెటిజన్ కేఏ పాల్ గురించి చెప్పాలని కోరగా తెలియదండి అంటూ నాగబాబు జవాబు చెప్పడం గమనార్హం. బన్నీ గురించి చెప్పాలని నెటిజన్ కోరగా పట్టుదల అని నాగబాబు సమాధానం ఇచ్చారు. నచ్చిన మీమ్ పేజ్ ఏదనే ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ అన్నీ అని జవాబు చెప్పారు. ఫ్రీ స్కీమ్స్ వల్ల వచ్చే లాభం ఏంటని ఒక నెటిజన్ అడగగా భార్య అమ్మఒడి డబ్బులతో మందు తాగుతున్నావ్ తెలుసుకో అని చెబితే భర్త మందు తాగడం వల్ల అమ్మఒడి డబ్బులు వస్తున్నాయని చెబుతాడని నాగబాబు తెలిపారు.

యాక్టింగ్ ప్రయాణంలో హిట్లు, ఫ్లాపులు సహజమని అందుకే గని ఆడలేదని నాగబాబు చెప్పుకొచ్చారు. విలన్ రోల్స్ లో ఎందుకు చేయట్లేదని అడగగా ఛాన్స్ రాలేదని నాగబాబు కామెంట్లు చేశారు. ఇటీవల రాజమహేంద్రవరంకు వెకేషన్ కు వెళ్లి వచ్చానని నాగబాబు వెల్లడించారు. బాగా నవ్వించిన మీమ్ ఏంటని ఒక నెటిజన్ ప్రశ్నించగా ఒక మహిళ ఏపీలో గ్యాస్ సిలిండర్ కోసం గాజులు, మంగళసూత్రం తీసి ఇవ్వడం అని నాగబాబు పేర్కొన్నారు.

ప్రభాస్ గురించి చెప్పాలని మరో నెటిజన్ కోరగా ప్రభాస్ డార్లింగ్ ఆఫ్ టాలీవుడ్ అని నాగబాబు కామెంట్లు చేశారు. కళ్యాణ్ దిలీప్ సుంకర గురించి అభిప్రాయం ఏమిటని అడగగా హార్డ్ కోర్ జనసైనిక్ అని నాగబాబు సమాధానం ఇచ్చారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus