Niharika: నిహారిక ఇష్యపై నాగబాబు భార్య కామెంట్స్‌ వైరల్‌!

మింక్‌ అండ్‌ పుడింగ్‌ పబ్‌ కేసులో చాలామంది ఉన్నప్పటికీ ఓ వర్గం మొత్తం నిహారిక కొణిదెల గురించే మాట్లాడింది. అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతోంది కూడా. అక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియకుండా ఎవరి కథ వారు చెప్పేస్తున్నారు. తాజాగా ఈ విషయం గురించి నిహారిక తల్లి పద్మజ మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తన బిడ్డ గురించి తనకు తెలుసనని, అయినా మా వెనుక మా బావగారు ఉన్నారు అంటూ గొప్పగా చెప్పారు పద్మజ.

నాగబాబు భార్య పద్మజ… పెద్దగా మీడియా ముందుకు రారు. కొడుకు, కూతురు సినిమాల ఓపెనింగ్స్‌, ఏవైనా టీవీ షోల కోసం భర్తతో కలసి బయటకు వస్తుంటారు. అయితే ఇటీవల ఆమె ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో నిహారిక గురించి, మొన్నీమధ్య జరిగిన పబ్‌ కేసు గురించి మాట్లాడారు. మదర్స్‌ డే సందర్భంగా ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు పద్మజ. పెళ్లి కాక ముందు తన భార్యకు అన్నయ్య చిరంజీవి అంటే చాలా ఇష్టముండేదని, అభిమాన హీరో అని నాగ బాబు ఆ మధ్య చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా నిహారిక, పద్మజ కొణిదెల ఇద్దరూ కూడా ఓ మీడియా చానెల్‌తో ముచ్చటించారు. నిహారిక మీద వచ్చే వార్తలు, ఇష్యూల మీద అమ్మగా మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని ప్రశ్నించారు యాంకర్‌. దానికి ఆమె ‘‘అలాంటి వార్తలు రావడం ప్రారంభంలో ఇబ్బందిగా అనిపించేవి. కానీ మేం ఉన్న సిట్యువేషన్‌లో ఇలాంటివి తప్పవు అని నన్ను నేను సర్ది చెప్పుకున్నాను. ఒకవేళ అలా చేయకపోతే అందరం ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చోవాలి.

తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అని గట్టిగానే చెప్పారు పద్మజ. నిహారిక ఎప్పుడైనా బయటకు వెళ్తే పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే మేం ఏంటో మా వాళ్లందరికీ తెలుసు. నిహారిక ఏంటో నాకు తెలుసు. అయినా మనం బాగున్నామంటే చాలు ఎదుటి వాళ్లు మనల్ని కష్టపెట్టాలని చూస్తుంటారు. రాళ్లు వేయాలని కూడా చూస్తుంటారు. అయినా మాకు మా బావ గారు చిరంజీవి ఉన్నారు.. ఆయన ఉన్నంతవరకు మాకేం ఫర్వాలేదు’’ అని చెప్పారు పద్మజ.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus