టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటుడిగా, నిర్మాతగా, బిజినెస్ మేన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున, కార్తీ కాంబినేషన్ లో ఊపిరి సినిమా తెరకెక్కగా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. కార్తీ గత సినిమా సర్దార్ తెలుగు హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ కొనుగోలు చేయగా ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది.
అయితే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ కార్తీ జపాన్ మూవీ హక్కులను సైతం కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది. దీపావళి పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన జపాన్ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. జపాన్ తెలుగు టీజర్ కు ఏకంగా 6.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నాగార్జున, సుప్రియ సైతం జపాన్ మూవీకి ప్రచారం చేసే ఛాన్స్ ఉంది.
కార్తీ తెలుగులో వరుసగా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (Nagarjuna) నాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకు కార్తీ, జపాన్ టీమ్ హాజరయ్యే ఛాన్స్ అయితే ఉంది. కార్తీ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది. కార్తీ తన సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. సోషల్ మీడియాలో కార్తీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
జపాన్ సినిమాతో కార్తీ ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న కార్తీ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కార్తీ సక్సెస్ రేట్ అంతకంతకూ పెరుగుతోంది. ఖైదీ, సర్దార్, పొన్నియిన్ సెల్వన్1, పొన్నియిన్ సెల్వన్2 సినిమాలతో వరుస విజయాలను అందుకున్న కార్తీ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.