Nagarjuna: ఆ హీరోను మాత్రమే అక్కినేని నాగార్జున అన్న అని పిలిచేవారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇవ్వగా త్వరలో బిగ్ బాస్ షోతో, మరిన్ని సినిమాలతో బిజీ కానున్నారు. ఒక సందర్భంలో నాగ్ మాట్లాడుతూ తాను అన్న అని పిలిచే ఏకైక హీరో హరికృష్ణ అని తెలిపారు. సీతారామరాజు సినిమాలో హరికృష్ణ, నాగార్జున అన్నాదమ్ములుగా నటించారు. తమ పాత్రలకు ఇద్దరూ న్యాయం చేశారు. ఆ సమయంలో హరికృష్ణ, నాగ్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.

ఆ అనుబంధం వల్ల సినిమా ఇండస్ట్రీలో ఎవరినీ అన్న అని పిలవని నాగ్ హరికృష్ణను మాత్రం అలా పిలిచేవాడినని తెలిపారు. నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. తాజాగా మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ఈవెంట్ కు హాజరైన నాగార్జున ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ అమల గర్భంతో ఉన్న సమయంలో తాను ఆరు నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో అమలతోనే ఉన్నానని నాగ్ చెప్పుకొచ్చారు.

మాతృత్వం అనేది ఒక అద్భుతమైన అనుభవం అని అమల గర్భవతి అయిన సమయంలో జరిగిన ప్రతి సంఘటన నాకు గుర్తే అని నాగార్జున వెల్లడించారు. హలో బ్రదర్ మూవీ షూట్ లో నేను ఉన్న సమయంలో అమల గర్భం ధరించిందని నాగ్ చెప్పుకొచ్చారు. డెలివరీ సమయంలో కూడా అమల చేయి పట్టుకుని ఉన్నానని నాగార్జున కామెంట్లు చేశారు. డెలివరీ అంటే ఒక ప్రాణం పోయడం అని అమల ప్రెగ్నెంట్ కావడం నా జీవితంలో బెస్ట్ మూమెంట్ అని నాగ్ (Nagarjuna) చెప్పుకొచ్చారు.

మిస్టర్ ప్రెగ్నెంట్ అనే టైటిల్ విన్న వెంటనే మగవాళ్లు ఎలా ప్రెగ్నెంట్ అవుతారని అనిపించిందని ట్రైలర్ చాలా బాగుందని ట్రైలర్ చూసిన తర్వాత సినిమాలో ఎలా చూపించారనే ఆసక్తి కలిగిందని నాగ్ వెల్లడించారు. ఈ సినిమా ఈ నెల 18వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. నాగ్ కొత్త సినిమాలకు సంబంధించి త్వరలో మరింత క్లారిటీ రానుంది. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వాలని నాగ్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus