టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. నాగ్, ధనుష్ (Dhanush) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కుబేర సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది నా సామిరంగ (Naa Saami Ranga) సినిమాతో సక్సెస్ సాధించిన నాగ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం భారీ హిట్లను అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. మనం (Manam) సినిమా రీరిలీజ్ సందర్భంగా నాగార్జున ఏఎన్నార్ ను (Akkineni Nageswara Rao) తలచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. మా కుటుంబానికి మనం సినిమా ఎంతో ప్రత్యేకం అని నాగార్జున అన్నారు.
మనం నాన్న ఆఖరి సినిమా అని ఈ సినిమా క్లాసిక్ గా నిలవాలని నాన్న భావించేవారని నాగ్ చెప్పుకొచ్చారు. టీమ్ వర్క్ తో మనం సినిమా విషయంలో అనుకున్నదే జరిగిందని నాగార్జున వెల్లడించారు. మనం సినిమాకు పని చేసిన అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అని నాగ్ కామెంట్లు చేయడం గమనార్హం. కొంచెం ఇబ్బంది పడుతూనే నాన్న సెట్స్ కు వచ్చేవారని నాగ్ చెప్పుకొచ్చారు. నాన్న మా అందరినీ నవ్వించేవారని నాగ్ కామెంట్స్ చేశారు.
నాన్నకు పెద్ద స్క్రీన్ పై మనం సినిమాను చూపించలేకపోయాననే బాధ మాత్రం ఎప్పటికీ ఉంటుందని నాగార్జున అభిప్రాయపడ్డారు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ (Vikram kumar) సైతం ఈ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకున్నారు. నాగేశ్వరరావు సార్ కు స్క్రిప్ట్ వినిపించే సమయంలో నా చేయి తగిలి టేబుల్ పై ఉన్న గ్లాస్ కిందపడి పగిలిపోయిందని విక్రమ్ కె కుమార్ తెలిపారు.
ఆ శబ్దానికి అక్కడ పని చేసే బాయ్స్ ఏం జరిగిందో అని కంగారుగా వచ్చారని ఆయన కామెంట్లు చేశారు. ఆ సమయంలో ఏఎన్నార్ డోర్ దగ్గర ఉన్నవారిని రావద్దని చెప్పారని విక్రమ్ కె కుమార్ తెలిపారు. నేను స్టోరీ చెప్పడం పూర్తయ్యాక వాళ్లు రూమ్ క్లీన్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేనని విక్రమ్ కె కుమార్ కామెంట్లు చేయడం గమనార్హం.