టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కినేని హీరోలు ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. ఇటీవల వరద బాధితులను ఆదుకోవడానికి అక్కినేని కుటుంబం కోటి రూపాయలు విరాళంగా ప్రకటించింది. అటు నాగ్ (Nagarjuna) , ఇటు నాగచైతన్య (Naga Chaitanya) కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
Nagarjuna
అయితే కొన్నిరోజుల క్రితం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల విషయంలో నాగ్ (Nagarjuna) కోర్టును ఆశ్రయించినా హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నాగ్ ఫ్యామిలీని కించపరిచేలా కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారు. సమంతపై చేసిన కామెంట్లను వెనక్కు తీసుకుంటామని కొండా సురేఖ ప్రకటించినా నాగ్ కుటుంబానికి సారీ చెబుతూ ఎలాంటి కామెంట్లు చేయలేదు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా నాగ్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగ్ రాజకీయాలకు సైతం దూరంగా ఉంటారని అలాంటి వ్యక్తిని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగార్జున ఈ కామెంట్ల విషయంలో లీగల్ గా ముందుకెళ్తారా అనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం. నాగ్ ఫ్యామిలీపై నిరాధార ఆరోపణల వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది.
కొండా సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని ఒక మహిళే మరో మహిళను అవమానించడం సిగ్గుచేటని ఎందుకు ఎప్పుడూ మమ్మల్నే టార్గెట్ చేస్తారంటూ ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఫైర్ అయ్యారు. ఇలాంటి కామెంట్ల వల్ల బాధిత మహిళలు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తారని మంచు లక్ష్మి అన్నారు. కొంతమంది సెలబ్రిటీలు రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తుండటం గమనార్హం. సెలబ్రిటీలను మానసికంగా దెబ్బ కొట్టేలా కామెంట్లు చేయడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున ప్రస్తుతం కూలీ (Coolie) , కుబేర సినిమాల్లో నటిస్తుండగా ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.