బిగ్ బాస్ రియాలిటీ షో హోస్టింగ్ చేయడం అంటే అది మాములు విషయం కాదు, ఒక్కోసారి కొంతమందికి ఫేవరెటిజం చూపిస్తున్నామని ట్రోల్స్ వస్చేస్తాయ్. ఎంత బాగా హోస్ట్ చేసినా అందర్నీ శాటిస్ ఫై చేయలేరు. అయితే, గత కొన్ని సీజన్స్ గా కింగ్ నాగార్జున హోస్టింగ్ ని బ్యాలన్స్ చేస్తూ వస్తున్నారు. ఈ సీజన్ లో అయితే దుమ్మురేపుతున్నారు. పార్టిసిపెంట్స్ ని ఎక్కడా గుక్క తిప్పుకోనివ్వకుండా దంచి పారేస్తున్నారు. ఈ నేపథ్యంలో 8వ వారం నాగార్జున హోస్టింగ్ పై ట్రోలింగ్ వస్తున్నాయి.
ఈవారం నాగార్జున అమర్ ని, శోభాశెట్టిని ఒక ఆట ఆడుకున్నారు. శోభాశెట్టి పిచ్చోడా అని అన్నందుకు వీరలెవల్లో క్లాస్ పీకారు. అలాగే, ఎగ్రెషన్ లో నువ్వు కూడా ఇలా చేస్తే బయట అందరూ నిన్ను కూడా పిచ్చోడనే అంటారని అన్నాడు. ఇది ఆడియన్స్ కి నచ్చలేదు. శోభాశెట్టి రెచ్చగొడితేనే ప్రిన్స్ అలా చేశాడని కింగ్ నాగార్జున యావర్ కి క్లాస్ పీకడం కరెక్ట్ కాదని ట్రోల్ చేస్తున్నారు.
అలాగే, అమర్ కి – ప్రియాంకకి కూడా గేమ్ ఎలా ఆడాలో ఇండైరెక్ట్ గా హింట్స్ ఇస్తున్నారని, సందర్భమే లేకుండా గ్రూపిజం వీడియో చూపించి వాళ్లకి ఫేవర్ చేశారని అంటున్నారు. తేజ గ్రూపిజం గురించి ఎప్పుడో నామినేషన్స్ లో చెప్పిన వీడియో, ఆ తర్వాత శోభతో తేజ మంతనాలు జరిగి గ్రూప్ గా గేమ్ ఆడింది చూపించారు. దీన్ని బట్టీ మిగతా వాళ్లకి ఎలా గేమ్ ఆడకూడదో అర్దం అవుతుంది.
అయితే, ఈవీడియో చూపించాక తేజకి అస్సలు క్లాస్ పీకలేదు. మరి అలాంటపుడు ఈ వీడియో ఎందుకూ చూపించాల్సి వచ్చింది ? అర్జున్ కి అర్దమవ్వాలనా ? ప్రియాంకకి అర్ధం అవ్వాలనా ? అని అడుగుతూ నాగార్జునని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు శివాజీకి కూడా సోఫాజీ అని పిలుస్తూ హింట్ ఇచ్చారు. సోఫాలో కూర్చోవడం కాకుండా ఫైర్ తో గేమ్ ఆడమని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు.
అలాగే, రతిక కి కూడా మనుషులతో కాదు, ఫోకస్ టాస్క్ పైన పెట్టి గేమ్ ఆడు అని డైరెక్ట్ గా చెప్పారు. అక్కడికి వెళ్లి గతం తవ్వుకుంటే గతంలోనే ఉండిపోతావ్ అని హెచ్చరించారు. పల్లవి ప్రశాంత్ తో రతిక తను గతంలో చేసిన విషయాలు డిస్కస్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈవిషయంలోనే నాగార్జున గేమ్ ఆడితే ఆటోమేటిక్ గా ఓట్లు వస్తాయని, నువ్వు మనుషులతో ఆడుకోవడం మళ్లీ మొదలెట్టద్దని హింట్ ఇచ్చారు. మరి ఈ హింట్స్ ని బట్టీ వీళ్లిద్దరూ (Bigg Boss 7 Telugu) గేమ్ లో గేర్ మారుస్తారా లేదా అనేది చూడాలి.