Nagarjuna: శోభా శెట్టికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగార్జున!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి శోభా శెట్టి ఒకరు. ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇలా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నటువంటి ఈమె 14 వారాలపాటు హౌస్ లో కొనసాగుతూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఇక ఈమె సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే తాజాగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున తనకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు అంటూ ఈమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు

అసలు నాగార్జున ఈమెకు ఏం గిఫ్ట్ పంపించారనే విషయానికి వస్తే నాగార్జున ఆరవ వారంలో భాగంగా రెడ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఒక టీ షర్ట్ వేసుకొని రాగా మీ టీషర్ట్ చాలా బాగుంది నాకు గిఫ్ట్ గా ఇవ్వండి సార్ అంటూ ఈమె అడిగారు అయితే ఈ విషయాన్ని నాగార్జున గుర్తు పెట్టుకొని మరి ఆమె ఎలిమినేట్ అయినప్పుడు ఆ టీ షర్ట్ ఇచ్చారని తెలుస్తుంది.

ఇదే విషయాన్ని ఈమె తెలియజేస్తూ నాగార్జున (Nagarjuna) గారిని నేను అడిగినటువంటి టీషర్ట్ గుర్తుపెట్టుకొని మరి నేను ఎలిమినేట్ అయినప్పుడు నాకు ఇచ్చారని ఇంతకన్నా మరేం కావాలి అంటూ తన సంతోషాన్ని తెలియజేయడమే కాకుండా ఆ టీషర్టులో ఈమె ఫోటోషూట్ కూడా చేశాను అంటూ ఫోటోషూట్ కి సంబంధించినటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus