Nagarjuna: నాగార్జున అసలైన గ్లామర్ సీక్రెట్ అదే..అలా చేయడం మన వల్ల కాదు లెండి..!

అక్కినేని నాగార్జున 65 ఏళ్ళ వయసులో కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. మరోపక్క ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ఎం.డి గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే బిజినెస్ వ్యవహారాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. అయితే 65 ఏళ్ళ వయసు వచ్చినా నాగార్జున 30 ప్లస్ లా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉంటారు. నాగార్జున గ్లామర్ చూసి కుర్ర హీరోలు సైతం జలస్ ఫీలవుతూ ఉంటారు అనడంలో సందేహం లేదు.

Nagarjuna

ఇద్దరు కొడుకులకి పెళ్ళైనా నాగ్ అంతే హ్యాండ్సమ్ గా ఉన్నారు. అయితే నాగార్జున గ్లామర్ కి సీక్రెట్ ఏంటి అని చాలా సందర్భాల్లో చాలా మంది ఆరా తీసినా ఆయన చిన్న చిరునవ్వు నవ్వేసి దాటేస్తూ ఉంటారు. అందుకు కారణం.. ఆ చిరునవ్వే అని చెబుతూ ఉంటారు.

అయితే నాగార్జున గ్లామర్ సీక్రెట్స్ వేరు. ఆయన ఇప్పటికీ బయట ఫుడ్ కి దూరంగా ఉంటారట. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో తినాల్సి వచ్చినా టైంకి తినేస్తారట. మధ్యాహ్నం టైంలో మీల్స్ వంటివి తీసుకున్నా, సాయంత్రానికి అంటే 7 గంటలకు డిన్నర్ చేసేస్తారట. ఎక్కువగా ఈవెనింగ్ టైంలో ఫ్రూట్ సలాడ్స్ వంటివి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారట. అలాగే నాగార్జున కి హైదరాబాద్ నగర శివార్లలో ఒక డైరీ ఫామ్ ఉందట.

దాన్ని కొంతమంది వర్కర్స్ తో మెయింటైన్ చేస్తుంటారట. అక్కడి తీసిన చిక్కనైన పాలనే నాగ్ అండ్ ఫ్యామిలీ ఉపయోగిస్తారట. అలాగే ఒక 10 ఎకరాల్లో కొంతమంది వర్కర్స్ ని పెట్టించుకుని ఫార్మింగ్ కూడా చేయిస్తున్నారట. అక్కడ పండిన కూరగాయాలనే నాగ్ ఇంటికి తెచ్చి వంటలకి వాడతారట.అలాగే హెయిర్ ఆయిల్స్ వంటివి కూడా ఎక్కువగా సహజ సిద్దమైనవే వాడతారట. అది మేటర్.

స్టంట్‌ మ్యాన్‌ మృతి.. ఎట్టకేలకు స్పందించిన పా.రంజిత్‌!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus