Nagarjuna: అలా జరిగితే నాగార్జునకు ఇబ్బందేనా?

సీనియర్ స్టార్ హీరోలు కథల విషయంలో ఏ మాత్రం మారడం లేదు. మూడు ఫైట్లు, ఆరు పాటలు ఉన్న కథలను ఎంచుకుంటూ సీనియర్ స్టార్ హీరోలు కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో కొత్త తరహా కథాంశాలను ఎంపిక చేసుకుంటున్న నేపథ్యంలో రొటీన్ మాస్ మసాలా సినిమాల్లో నటిస్తున్న హీరోలకు వరుసగా షాకులు తగులుతున్నాయి. మరోవైపు నాగార్జున ఈ మధ్య కాలంలో నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కావడం లేదు.

రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో నాగ్ హీరోగా రకుల్ హీరోయిన్ గా నటించిన మన్మథుడు2 ఏ రేంజ్ డిజాస్టర్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత నాగార్జున హీరోగా తెరకెక్కిన వైల్డ్ డాగ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. నాగార్జున సైతం ప్రస్తుతం నటిస్తున్న బంగార్రాజు సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధించకపోతే నాగ్ కెరీర్ పై ప్రభావం పడే ఛాన్స్ ఉంది.

సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బంగార్రాజు సినిమా సక్సెస్ సాధించకపోతే ఇతర సీనియర్ హీరోల మాదిరిగా నాగ్ సైతం పాత్రల ఎంపిక విషయంలో మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు. నాగార్జునతో కలిసి నాగచైతన్య నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus