Nagarjuna: శేఖర్‌ కమ్ముల సినిమాను అనుకోని అడ్డంకి… ఎలా అధిగమిస్తారో?

నెర్వస్‌ 90స్‌లో ఉన్న నాగార్జున 99వ సినిమా సంగతి ఇంకా తేలడం లేదు. రైటర్‌ను డైరక్టర్‌ చేస్తారని తొలుత అనుకున్నా.. ఆ తర్వాత ఇప్పుడు కొరియోగ్రాఫర్‌ను డైరక్టర్‌ను చేస్తున్నారు అని అంటున్నారు. ఆ విషయం కాసేపు పక్కనపెడితే ఇప్పుడు వందో సినిమా గురించి చర్చ మొదలైంది. అంటే వందో నెంబరు ఏ సినిమాకు పడాలి అనే విషయం మీద అన్నమాట. చాలా రోజుల క్రితమే నాగార్జున వందో సినిమా ఓకే అయిపోయింది. అయితే ఇప్పుడు నెంబర్‌ లెక్క కాస్త ఇబ్బంది పెడుతోంది అంటున్నారు.

ధ‌నుష్‌తో శేఖ‌ర్ క‌మ్ముల ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ర‌ష్మిక మందన క‌థానాయిక‌గా నటిస్తున్న ఆ సినిమాను ఇటీవల పూర్తి స్థాయిలో ఓకే చేశారు. అయితే ఈ సినిమాలో మ‌రో కీల‌క‌మైన పాత్ర ఉందట. అందులో నాగార్జున న‌టిస్తే బాగుంటుంద‌నేది దర్శకుడు శేఖ‌ర్ క‌మ్ముల ఆలోచ‌న‌. అందుకే ఇటీవ‌ల నాగార్జునను క‌లిసి క‌థ వినిపించారట. క్యారెక్ట‌ర్ టెంప్టింగ్‌గా ఉండటంతో నాగార్జున కన్విన్స్‌ అయ్యారట. అయితే ఓ విషయంలో ఈ సినిమాను హోల్డ్‌లో పెట్టారు అని అంటున్నారు.

నాగార్జున ఆ సినిమాను ఓకే చేస్తే.. అది వందో సినిమా అవుతుంది. నిజానికి వందో సినిమాను మోహన్‌రాజా దర్శకత్వంలో చేయాలని ఎప్పుడో ఫిక్స్‌ అయ్యారు. అందులో అఖిల్‌ కూడా నటిస్తాడని టాక్‌ వచ్చింది. ఇప్పుడు శేఖర్‌ కమ్ముల – ధనుష్‌ సినిమాను ఓకే చేస్తే అది వందో సినిమాగా మారుతుంది. అందుకే కాస్త ఆగుతున్నారు అంటున్నారు. దీనికి మధ్యే మార్గంగా 99వ సినిమా, వందో సినిమాను స్టార్ట్‌ చేసేసి తర్వాత శేఖర్‌ కమ్ముల సినిమాను అనౌన్స్‌ చేయొచ్చు అనే మాట సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది.

ఈ నెల 29న నాగార్జున (Nagarjuna) పుట్టిన రోజు సందర్భంగా ఈ మూడు సినిమాల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సినిమాలు ఎప్పుడు అనేది కాకపోయినా సినిమాల నెంబర్‌ సంగతి తేలిపోతుంది. అలాగే శేఖర్‌ కమ్ముల వెయిట్‌ చేయాలా లేక మోహన్‌ రాజా వెయిట్‌ చేయాలా అనే విషయంలోనూ క్లారిటీ రావొచ్చు. 99వ సినిమా సంగతి కూడా తేలొచ్చు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus