ఇటీవల కాలంలో ఒకే కుటుంబానికి చెందిన వారు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. కథ ఏ మాత్రం వచ్చినా కూడా వీలైనంత త్వరగా భారీ బడ్జెట్ తోనే తెర పైకి తీసుకువచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇక అలాంటి విషయంలో అయితే అక్కినేని హీరోలు మరింత స్పీడ్ గా ఉంటారు అని చెప్పవచ్చు. ఇది వరకే మనం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అక్కినేని హీరోలు వీలైనంత ఎక్కువగా మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
నాగార్జున మనం సినిమాతో పాటు నాగచైతన్య తో బంగార్రాజు సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే. కానీ అక్కినేని అఖిల్ తో మాత్రం ఆయన ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించలేదు. అందుకోసమే అఖిల్ కోసం ప్రత్యేకంగా మరొక కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న మోహన్ కృష్ణ మల్టీస్టారర్ వారి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకే నాగార్జునకు ఆ దర్శకుడు మెయిన్ స్టోరీ లైన్ కూడా వినిపించినట్లు టాక్.
నాగార్జునకు కూడా పాయింట్ చాలా బాగా నచ్చిందట. ఇక పూర్తి స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన తరువాత మరొకసారి మాట్లాడదామని కూడా అన్నారట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నా మోహన్ కృష్ణ ఆ సినిమా పనులన్నీ పూర్తి అవ్వగానే అక్కినేని మల్టీ స్టారర్ పై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
అలాగే నాగార్జున కూడా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటున్నాయి ఇక త్వరలోనే మోహన్ కృష్ణ ప్రాజెక్టుపై కూడా అఫీషియల్గా క్లారిటీ ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!