Nagarjuna: సిరి – షణ్ముక్ లపై నాగ్ సెటైర్లు..! అసలు ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ కి సర్ ప్రైజెస్ ఇచ్చేందుకు వాళ్ల ప్రెండ్స్ ఇంకా కుటుంబ సభ్యులు స్టేజ్ పైకి వచ్చి సందడి చేశారు. మిత్రా కోసం సిరి వస్తే, యాంకర్ శివకోసం షణ్ముక్ వచ్చాడు. మరోసారి సీజన్ 5ని వీళ్లిద్దరూ కూడా గుర్తు చేశారు. వీకెండ్ హౌస్ మేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ని, పేరెంట్స్ ని స్టేజ్ పైకి తీస్కుని వచ్చి మరీ వారితో టాప్ -5 గేమ్ ని ఆడించింది బిగ్ బాస్ టీమ్. ఫస్ట్ మిత్రా కోసం వచ్చిన సిరికి నాగార్జున సెటైర్స్ వేస్తునే ఉన్నాడు.

సిరితో పాటుగా మిత్రా కోసం గంగాధర్ కూడా వచ్చాడు. ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతూనే వాళ్ల లవర్ గురించి అడిగాడు. అలాగే, మిత్రా నామినేషన్స్ అప్పుడు బిందు ఫిజికల్ అయ్యిందా అంటూ సిరిని అడిగాడు. నాకు అలా అనిపించలేదు అంటూ సిరి చెప్పింది. తర్వాత మా శివ అంటే, ఇదేమన్నా రీజనల్ ఫీలింగా అంటూ అడిగారు నాగార్జున. శ్రీహాన్ గురించి కూడా మాట్లాడుతూ సిరితో కాసేపు ఫన్ చేశారు.

ఇక యాంకర్ శివకోసం వచ్చిన షణ్ముక్ తో అయితే, ప్రస్తుతం బ్రేకప్ లో బిజీగా ఉన్నావా అంటూ సెటైర్ వేశారు నాగార్జున. దీంతో నవ్వుతూ సార్.. అంటూ కొట్టిపారేశాడు షణ్ముక్ జస్వంత్. అలాగే, దీప్తి ఎలా ఉంది అంటూ అషూరెడ్డి కూడా హౌస్ లో నుంచీ కొద్దిగా సెటైరికల్ గానే మాట్లాడింది. తను బానే ఉంటుందిలే అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముక్. షన్నూ ఏంట్రా ఇది అంటూ మరోసారి నాగార్జున షణ్ముక్ ని ఆటపట్టించారు.

ప్రస్తుతం బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉంది అని, ఏం చేస్తున్నావా అని అడిగినపుడు కొన్ని వెబ్ సీరిస్ ల కోసం ప్రిపేర్ అవుతున్నానని చెప్పాడు షణ్ముక్. ఇక అఖిల్ కి థ్యాంక్స్ చెప్పూ, బయట నాకు నెగిటివిటీ వస్తే సపోర్ట్ చేశాడని అన్నాడు. దీంతో నాగార్జున నీకు నెగిటివిటి వచ్చిందా అంటూ షణ్ముక్ ని అడిగారు. సార్.. ఎక్కడ్నుంచీ స్టార్ట్ చేయమంటారు అంటే, ఏదైనా సరే చెప్పు పర్లేదు అంటూ మాట్లాడారు నాగార్జున.

ఆ తర్వాత షణ్ముక్ టాప్ – 5 పెట్టమని, అషూ ఏదో అడిగింది చెప్పు అంటే, వైజాగ్ వాళ్లకి కొద్దిగా నోటి దురద ఉంటుందని, అందుకే అషూ అలా అడుగిందని, దీప్తి మంచిగానే ఉంటుందని, నేను త్వరలోనే కలుస్తానని మరీ చెప్పాడు. అలాగే, అఢిగినందుకు చాలా థ్యాంక్స్ అంటూ సెటైరికల్ గానే చెప్పాడు. మొత్తానికి నాగార్జున మరోసారి షణ్ముక్ తో ఫన్ చేశారు. అదీ మేటర్.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus