బిగ్ బాస్ హౌస్ లో వీకండ్ నాగార్జున వస్తున్నారంటే హౌస్ మేట్స్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అందులోనూ ఇప్పుడు 11 వారాలు గడిచిపోయాయి కాబట్టి, హౌస్ లో ఎవరు ఏ యాక్టివిటీ చేసినా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఎవరు ఏది మాట్లాడినా కూడా అది టెలికాస్ట్ అవుతుంది. గతవారం ఫ్రీ ఎవిక్షన్ పాస్ట్ టాస్క్, అలాగే కెప్టెన్నీ పోటీదారుల టాస్క్ విషయంలో హౌస్ మేట్స్ కి గట్టిగానే గడ్డి పెట్టారు కింగ్ నాగార్జున. ఈవిషయంలో ఆదిరెడ్డి తాట తీశారనే చెప్పాలి. అసలు ఏంజరిగిందంటే..,
బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ ని ఎప్పటిలాగానే పలకరించిన నాగార్జున ఒక పిట్టకథ చెప్పారు. గట్టుమీద కుర్చున్నవాడు ఎన్ని కబుర్లు అయినా చెప్తాడు అనే కథని చెప్పారు. తర్వాత రేవంత్ కి క్లాస్ పీకారు. శక్తి ఆటలో చూపించమని, మాటలో కాదని చెప్పారు. అంతేకాదు, రూడ్ గా అధికారం చెలాయిస్తూ కాకుండా ప్రేమగా చెప్తే చాలా విషయాలు పరిష్కారం అవుతాయన్నారు. తర్వాత ఆదిరెడ్డి కి ఒక రేంజ్ లో క్లాస్ పడింది.
ముఖ్యంగా ఎవిక్షన్ ఫ్రీపాస్ వాడుకోను, గేమ్ ఆడకపోవడం కూడా నా గేమే అన్నందుకు ఫుల్ క్లాస్ పీకారు. గట్టుమీద కూర్చున్న వ్యక్తి నువ్వే అని, ఫైనల్ గా గీతుకి పట్టిన గతి నీకు పడుతుందని హెచ్చరించారు. అంతేకాదు, రేవంత్ విషయంలో వీడియో చూపిస్తే వెళ్లిపోతాను అన్నావ్ కదా, ఎన్నిసార్లు అలా ప్రగల్భలు పలుకుతావ్ అంటూ చురకలేశారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఆడకుండా పక్కనోళ్లకి సలహాలు కూడా ఇచ్చావ్, బయట ఓట్లు పడవని చెప్తున్నావ్, బయట జనాలు ఏమనుకుంటున్నారో చెప్పడానికి నువ్వేమన్నా తోపా, తురుమా అంటూ తిట్టేశారు. కెప్టెన్సీ పోటీదారులు టాస్క్ ఆడావ్, మరి ఎవిక్షన్ ఫ్రీపాస్ అంటే అది కూడా ఇమ్యనిటీకి సంబంధించినదే కదా అంటూ లాజిక్ మాట్లాడారు. అంతేకాదు, నువ్వ ఒక్క రూపాయి పెట్టి అడిగినా బిగ్ బాస్ కన్సిడర్ చేసేవారు. లక్షరూపాయలకి కొనుక్కున్నావ్ అంటూ చెప్పారు. ఇదేవిషయం రాజ్ అడిగితే మాత్రం నువ్వు అతడ్ని బుకాయించావ్ అంటూ నిలదీశారు. ఆదిరెడ్డికి వేటికి ఆన్సర్ లేకుండా పోయింది.
ఇక రేవంత్ విషయంలో వీడియో చూస్తే బయటకి వెళ్లిపోతానని అన్నావ్ కదా అంటూ వీడియో చూపించారు. ఆ వీడియోలో తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాడు రేవంత్, మీ ఇష్టం అని అంటూనే మగవాళ్లతో కూడా ఆడితే ఆ మజా వేరే వస్తుందని అన్నాడు. ఈ వీడియోని మాత్రమే చూపించి ఆదిరెడ్డిని పూర్తిగా లాక్ చేశాడు కింగ్ నాగార్జున. దీంతో ఆదిరెడ్డి అవాక్కయ్యాడు. అయితే, ఆదిరెడ్డి మాత్రం తను అన్నమాటకి స్టాండ్ అయ్యే ఉన్నాడు. నాగార్జున చెప్తున్నా కూడా రేవంత్ ది తప్పే అంటూ మాట్లాడాడు కూడా. ఈవిషయంలో మరోసారి ఆదిరెడ్డికి క్లాస్ పీకుతూ, అనవసరంగా టాస్క్ లో లూప్స్ వెతికినా, టాస్క్ సరిగ్గా ఆడకపోయినా గీతుకి పట్టిన గతే నీకు పడుతుందని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. టాస్క్ లో గెలిచిన తర్వాత నువ్వు చెప్పే లాజిక్స్ అన్నీ వర్తిస్తాయి అని, అసలు టాస్క్ ఆడుకుండా అది గెలిచాననే ఫీలింగ్ లో ఎందుకు ఉన్నావంటూ గడ్డి పెట్టారు. ఎవిక్షన్ ఫ్రీపాస్ వేస్ట్ అంటున్నాడు ఆదిరెడ్డి బిగ్ బాస్ తీసేయండి, మీకు అస్సలు బుర్రలేదంటూ మాట్లాడారు కూడా.
దీంతో ఆదిరెడ్డికి తను చేసిన మిస్టేక్ తెలిసింది. నాగార్జున క్లాస్ పీకుతున్నప్పుడు కూడా ఆదిరెడ్డి అదే మాట మీదు ఉన్నాడు. ఎంత చెప్తున్నా కూడా తను ఎందుకు చేశాను అనేదే చెప్తూ కవర్ చేయడానికి ప్రయత్నించాడు. అంతేకాదు, ఆదిరెడ్డి రేవంత్ వీడియో చూపించినా కూడా పూర్తి వీడియో చూస్తే మీకు అర్ధమవుతుందంటూ నాగార్జునకే సలహా ఇచ్చాడు. దీంతో నాగార్జునకి కోపం వచ్చింది. నేను పూర్తి వీడియో చూశాకే మాట్లాడుతున్నానని, అంత చూడకుండా వచ్చి నీకు చెప్పట్లేదని అన్నాడు. అక్కడ్నుంచీ ఆదిరెడ్డి కామ్ గా ఉంటూ గేమ్ ఆడాడు. ఆ తర్వాత శ్రీహాన్ కి, శ్రీసత్యకి కూడా గట్టిగానే చురకలేశారు నాగార్జున. మొత్తానికి అదీ మేటర్.