Baladitya: బలహీనతతో ఆడుకున్న గీతు..! నిలదీసిన నాగార్జున..!

  • November 5, 2022 / 06:31 PM IST

బిగ్ బాస్ ప్రేక్షకులు శనివారం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తారు. ముఖ్యంగా నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ కి క్లాస్ పీకుతుంటే బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే, ఈ 9వ వారం ఎప్పుడెప్పుడు నాగార్జున వస్తారా ? రాంగ్ గా గేమ్ ఆడిన వారిని ఇరగదీస్తాడా అని చాలా వెయిట్ చేసారు. అందరూ ఊహించినట్లుగానే నాగార్జున గీతుకి బాలాదిత్య విషయంలో క్లాస్ పీకడం మొదలుపెట్టారు. ఇక్కడే బాలాదిత్య మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. వీరిద్దరి మద్యలో జరిగిన స్మోకింగ్ ఇష్యూపై క్లారిటీ ఇచ్చేందుకు నాగార్జున దీంతో మొదలుపెట్టారు.

స్క్వాడ్ లీడర్ అయిన ఆదిరెడ్డిని తమ టీమ్ మెంబర్స్ కి ర్యాంకింగ్ ఇమ్మన్నారు. దీంతో బాలాదిత్యకి 5వ నెంబర్ ఇచ్చాడు ఆదిరెడ్డి. ఈమెడల్ తిరగబడిపోయే సరికి అది సిగ్గుపడి తిరిగిపోయింది చూడు అంటూ బాలాదిత్యకి క్లాస్ పీకారు. అంతలా ఎందుకు అయిపోయావ్ అంటూ ప్రశ్నించాడు. దీనికి బాలాదిత్య నాది కోపం కాదు, బాధ అంటూ చెప్పాడు. నాకు ఒక మనిషి బాగా క్లోజ్ అని అన్నప్పుడు గేమ్ లో అతని వీక్ నెస్ పైన దెబ్బకొట్టను అంటూ చెప్పాడు.

ఇక్కడే నాగార్జున గీతు గేమ్ లో వాళ్ల అమ్మా, నాన్నతో అయినా సరే ఇలాగే ఆడి గెలుస్తా అని చెప్పిందని గుర్తు చేశాడు. ఇక్కడ గెలవడం ఇంపార్టెంట్ కానీ, ఎలా గెలిచాం అనేది ముఖ్యం అంటూ బాలాదిత్య సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇక గీతుని బాలాదిత్య అన్న మాటలు నాగార్జున రిపీట్ చేశారు. సిగ్గుండాలి, ప్రేమతో ఆడుకుంటున్నావ్, అసలు నువ్వు మనిషివేనా అంటూ మాటలు అన్నావ్ కదా అంటూ గుర్తుచేశారు. ఆఫ్ ట్రాల్ సిగరెట్ గురించి ఇన్ని మాటలా అని నిలదీశారు.

ఇక్కడే గీతు కల్పించుకుని ఇన్ని మాటలు అన్నా నేను తీస్కున్నాను సార్, కానీ నువ్వు నటించావ్ అనేసరికి తట్టుకోలేకపోయాను సార్ అంటూ బాధపడింది. దీనికి నువ్వు రెండు స్ట్రిప్స్ ఇస్తే సిగరెట్ ఇస్తా అనేది నచ్చలేదని, అసలు ఈ సెన్సిటీవ్ మేటర్ ని నేను బయటపెట్టాలని అనుకోలేదని బాలాదిత్య బాధపడ్డాడు. ఆటలో బాలాదిత్యతో సిగరెట్స్ తీసి ఆడుకున్నారు. కానీ, ఆట అయిపోయిన తర్వాత కూడా అతని బలహీనతతో ఆడుకోవడం కరెక్ట్ కాదంటూ చెప్పాడు.

ఇక బాలాదిత్య కళ్లనీళ్లు పెట్టుకుంటూ నేను ఇక్కడ్నుంచీ ఎప్పుడైనా వెళ్లిపోతానని, కానీ సిగెరట్ లేనిదే ఉండలేడనే , స్మోకరో, లేదా అది అతని వీక్ నెస్సో అనే ట్యాగ్ నాకు వద్దు సార్ అంటూ చెప్పాడు. దీనికి నాగార్జున ఆడియన్స్ ని బాలాదిత్యది తప్పా ? గీతుది తప్పా ? అంటూ ప్రశ్నించారు. దీంతో ఈ ఇష్యూ హౌస్ లో సీరియస్ అయ్యింది. మరి దీనిపై ఎలా నాగార్జున స్పందించారని తెలియాలంటే మనం ఎపిసోడ్ చూడాల్సిందే.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!


లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus