‘బిగ్‌బాస్’ నిర్వాహ‌కుల‌కు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్…!

‘బిగ్‌బాస్’… తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన రియాలిటీ షో. హౌస్ లో ఉన్నన్ని రోజులు కంటెస్టెంట్ లను స్టార్స్ కు మాదిరి ట్రీట్ చేస్తూ ఉంటారు మన ప్రేక్షకులు. ఇక సీజన్ ముగిసాక కూడా వారి ఫాలోయింగ్ వారికి ఉంటుంది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘బిగ్ బాస్ సీజ‌న్1’ మొదలైనప్పటి నుండీ ఏదో ఒక రకంగా లీకులు వెంటాడుతూనే ఉండడం మనం చూస్తూనే వస్తున్నాం. సీజ‌న్ ప్రీమియ‌ర్ మొదలవ్వడానికి ముందే కంటెస్టెంట్లుగా ఎవరు పాల్గొంటారు వంటి విషయాల నుండీ.

మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు.. అనే విషయాలు ప్రేక్షకులకు తెలిసిపోతున్నాయి. అయితే రోజూ ఎపిసోడ్ లు ఫాలో అయ్యేవారికి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం తెలీడం పెద్ద కష్టమేమి కాదు. అయితే ‘ఎవరు నామినేషన్స్ లో ఉంటారు.. ఎవరు కెప్టెన్ అవుతారు’ అనే విషయాలు కూడా తెలిసిపోతున్నాయి.ఇది వరకు అంటే వీకెండ్ ఎపిసోడ్స్ కు ఆడియెన్స్ వచ్చేవారు.దాంతో ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనే విషయం సోషల్ మీడియాలో లీక్ అయిపోయేది.

కానీ ఈసారి కరోనా ఎఫెక్ట్ వల్ల ఆడియెన్స్ ను రానివ్వడం లేదు. అయినా లీకులు అవుతున్నాయి. ఇలాంటి విషయాల పై నాగార్జున ‘బిగ్‌బాస్’ టీమ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట‌. ఇలాంటి లీకుల మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటే అస్సలు సహించేది లేదని… హోస్టింగ్ చెయ్యడం మానేస్తానని నాగార్జున చెప్పారట. దీంతో ‘బిగ్ బాస్’ నిర్వాహకులు అలెర్ట్ అయ్యి.. ఇలాంటి లీకులు జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus