సీనియర్ హీరో నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. హిందీ రిలీజ్ కి సంబంధించిన బాధ్యతను నాగార్జున తన భుజాలపై వేసుకున్నారు. అదొక రకంగా రిస్క్ అనే చెప్పాలి. అసలు విషయంలోకి వస్తే.. ‘ది ఘోస్ట్’ సినిమా హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను ఎప్పుడో అమ్మేశారు.
ఇప్పుడు హిందీలో సినిమాను రిలీజ్ చేయాలంటే నిర్మాతల వల్ల సాధ్యం కాదు. హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ కొనుక్కున్న బయ్యర్ వల్ల మాత్రమే కుదురుతుంది. కానీ హిందీ బెల్ట్ లో సినిమాను రిలీజ్ చేయడమంటే అంత ఈజీ కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఆ రిస్క్ చేయడం ఎందుకనేది బయ్యర్ ఆలోచన. సినిమా నిర్మాతలు కూడా రిస్క్ చేయడానికి రెడీగా లేరు. దీంతో నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి హిందీ బయ్యర్ తో ఒక డీల్ కుదుర్చుకున్నారు.
ఖర్చులన్నీ తను చూసుకుంటానని.. లాభాలొస్తే మాత్రం తను పెట్టిన ఖర్చు వెనక్కిచ్చేలా బయ్యర్ కు, నాగార్జున మధ్య డీల్ కుదిరింది. ఈ మేరకు రూ.4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆదాయం రాకపోతే ఆ రిస్క్ ను తను భరిస్తానని చెప్పి..
నాగార్జున తన సినిమాను హిందీ బెల్ట్ లో విడుదల చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ‘బ్రహ్మాస్త్ర’ తరువాత నాగార్జున హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ నమ్మకంతోనే నాగ్ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!