Nagarjuna: ఓటీటీలో ప్రయోగాలకు హీరో రెడీ!

ఈ మధ్యకాలంలో చాలా మంది నటీనటులు డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్లు వెబ్ సిరీస్ లు, వెబ్ సినిమాలు అంటూ బిజీ అయిపోయారు. ఈ క్రమంలో సీనియర్ హీరో నాగార్జున కూడా ఓటీటీలోకి ఎంటర్ అవుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు.. నాగార్జున సొంతంగా ఓటీటీ యాప్ కూడా పెట్టబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. యాప్ సంగతేమో కానీ.. తన ఓటీటీ ఎంట్రీపై మాత్రం నాగ్ స్పందించారు.

ఈ సీనియర్ హీరో త్వరలోనే ఓటీటీ మూవీ చేయబోతున్నారు. ఈ సీనియర్ హీరోకి ఓ సబ్జెక్ట్ బాగా నచ్చింది. అది ఓటీటీలోనే బాగుంటుందని నాగ్ భావిస్తున్నాడట. అందుకే త్వరలోనే ఓటీటీలో అడుగుపెట్టబోతున్నట్లు చెప్పారు నాగార్జున. ఓ ఐడియా అనుకున్నామని.. బాగా నచ్చిందని.. ప్రస్తుతమైతే ఇంకా డెవలప్ చేసే స్టేజ్ లోనే ఉందని.. అందీ అనుకుంటున్నట్లు అది ఓటీటీ సినిమానే అని చెప్పుకొచ్చారు. ఈ వేదిక తనకు కొత్తది కావడంతో ప్రయోగాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

సినిమాల్లో ఇప్పటివరకు తను ట్రై చేయనివి ఓటీటీలో చేయబోతున్నట్లు చెప్పారు. నిజానికి నాగ్ ‘వైల్డ్ డాగ్’ సినిమాతోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ చివరి నిమిషంలో దానిని థియేటర్లో విడుదల చేశారు. లేదంటే ఈపాటికే నాగ్ డిజిటల్ ఎంట్రీ జరిగిపోయేది.

Most Recommended Video



విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus