Nagarjuna: నాగార్జున కొత్త సినిమా ఓకే అయిందా? దర్శకుడు అతనేనా?

సెంచరీకి నాగార్జున రెండు పరుగుల దూరంలో ఉన్నారు. 99వ పరుగు సంక్రాంతికి తీయబోతున్నారు. వందో పరుగు విషయంలో గత కొన్ని నెలలుగా రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి నాగ్‌ సెంచరీ మూవీ ఎప్పుడో ఫైనల్‌ అయ్యింది. కానీ ఇప్పుడు మరో సినిమా పేరు వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే నాగ్‌ వందో సినిమా కాస్త ప్రయోగాత్మకంగా ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే ఓ కోర్టు రూమ్‌ డ్రామా కథను ఓకే చేశాంటున్నారు.

‘నా సామిరంగ‌’ అంటూ ఈ పొంగల్‌కు 99వ సినిమాతో రాబోతున్నాడు నాగార్జున. ఈ సినిమా తర్వాత అంటే 100వ సినిమా ఏది అనేది తేలడం లేదు. ఎందుకంటే తొలుత ఈ ల్యాండ్ మార్క్‌ సినిమాను మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కిస్తారని చెప్పారు. కానీ అనూహ్యంగా ఆ ప్లేస్‌లోకి శేఖ‌ర్ క‌మ్ముల – ధ‌నుష్ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాలో నాగ్‌ది ప్రధాన పాత్ర కాదని, కీలక పాత్ర అని అంటున్నారు. కాబట్టి దానికి వందో సినిమాగా కౌంట్‌ చేయొద్దనేది ఆలోచనట.

కాబట్టి వందో సినిమా ఏది అనే విషయంలో క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. దాని కోసం నాగ్‌ ఇటీవల ఓ కొత్త దర్శకుడి కథను విన్నారట. ‘నా సామిరంగ‌’తో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ దగ్గర రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న సుబ్బుకి ఛాన్స్ ఇవ్వ‌బోతున్నారట. నిజ జీవిత సంఘ‌ట‌న‌ల్ని ఆధారంగా చేసుకొని సుబ్బు ఓ క‌థ రాసుకున్నారని సమాచారం. అందులో హీరో లాయర్‌గా కనిపిస్తారట.

సుబ్బు రాసుకున్న కథలోని కోర్ట్ రూమ్ డ్రామా నాగార్జున‌కు బాగా న‌చ్చింద‌ని… సూర్య ‘జై భీమ్‌’ సినిమాలా ఓ సోష‌ల్ మెసేజ్ ఇవ్వ‌బోతున్న‌ట్టు సమాచారం. త‌క్కువ బ‌డ్జెట్లో, త‌క్కువ రోజుల్లో ఈ సినిమా పూర్తి చేసే అవ‌కాశం ఉంది అని అంటున్నారు. అయితే మలయాళ సినిమా ‘నెరు’కు రీమేక్‌ అవ్వొచ్చేమో అనేది మరో టాక్‌. ఈ విషయంలో త్వరలో క్లారిటీతోపాటు ప్రకటన కూడా ఉంటుంది అని చెబుతున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus