తెలుగునాట ‘బిగ్ బాస్’ షోకి ఏర్పడ్డ క్రేజ్ అంతా ఇంతా కాదు.కొంతమంది ఫేడౌట్ అయిపోయిన ఆర్టిస్ట్ లను.. అలాగే టాలీవుడ్ కు సంబంధించి వివిధ రంగాల్లో క్రేజ్ సంపాదించుకున్న ఆర్టిస్ట్ లను ఈ షోకి కంటెస్టెంట్ లు గా తీసుకోవడం…వాళ్ళు ‘హౌస్ లో ఎంటర్ అయ్యాక.. కొన్ని టాస్క్ లు ఇచ్చి వారి ఒరిజినల్ ఎమోషన్స్ ను బయటకు తియ్యడం’ అనేది ‘బిగ్ బాస్’ షో యొక్క కాన్సెప్ట్.మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేసి బ్లాక్ బస్టర్ చేసాడు.
తరువాత రెండో సీజన్ ను నాని హోస్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిపాడు. ఇక మూడో సీజన్ ను నాగార్జున హోస్ట్ చేసి అదే అవుట్ పుట్ అందించాడు. ఇక ఇప్పుడు నాలుగో సీజన్ కు కూడా రంగం సిద్ధమైంది. ఇప్పుడు వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న రిత్యా నాలుగో సీజన్ ను 50రోజులకు కుదించారట.ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు. ఈ సీజన్ కు ఎంపికయిన కంటెస్టెంట్ లను టెస్టులు చేసి హోమ్ క్వారంటైన్ లో ఉంచారని తెలుస్తుంది.
ఇక ఈ 4వ సీజన్ కు నాగార్జున పారితోషికం తగ్గి ఉంటుంది అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిది ఏమీ లేదని.. మూడో సీజన్ కి ఆయనకు ఎంత ఇవ్వడం జరిగిందో.. ఈ నాలుగో సీజన్ కు కూడా అంతే ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ నాలుగవ సీజన్ కు గాను నాగార్జున 5 కోట్ల వరకూ పారితోషికం అందుకోబోతున్నాడని తెలుస్తుంది.