యువ అగ్ర నిర్మాత నాగవంశీ, సినిమా జనాల మధ్య ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ స్టైల్ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు కాంట్రవర్శీ కామెంట్లు చేసే ఆయన సినిమాల గురించి, ఆయన మాటల గురించి మీడియాలో వార్తలు వస్తుంటాయి. అలాగే మీడియాలో, సోషల్ మీడియాలో తన మీద వచ్చే కామెంట్లకు ఆయన బలంగా రిటార్ట్ ఇస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి నాగవంశీ మీడియా గురించి, అందులో వచ్చే సినిమా రివ్యూల గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు.
నాగవంశీ (Nagavamsi) ఇప్పటివరకు తీసిన సినిమాల్లో బాగున్నవాటికి బాగున్నాయి అని రాశారు, బాగులేనివాటికి బాగోలేవు అని రాశారు. అయితే ఎక్కడో ఎవరో రాసిన నెగిటివ్ రివ్యూల విషయంలో ఆయన హర్ట్ అయ్యారు. గతంలోనే ఈ విషయంలో తన అసంతృప్తిని బహిరంగంగానే విమర్శించారు. ఇప్పుడు మరోసారి రివ్యూల గురించి తనదైన శైలిలో విమర్శలు చేశారు నాగవంశీ. ఈ క్రమంలో ‘గుంటూరు కారం’ సినిమా రివ్యూల గురించి కూడా ప్రస్తావించారు.
సినిమా రివ్యూ అనేది ఆ రివ్యూ రాసే వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయం. ఒకరికి లవ్‌స్టోరీ నచ్చితే… అలాంటి సినిమాలకు ఎక్కువ రేటింగ్ ఇవ్వొచ్చు. యాక్షన్ జోనర్ సినిమాలు నచ్చితే అలాంటి సినిమాల గురించి మంచిగా రాయొచ్చు అంటూ రివ్యూల స్టైల్‌ను తనదైన శైలిలో వివరించారు. అయితే వెబ్‌సైట్ రివ్యూల కంటే సోషల్ మీడియా రివ్యూలు ఎక్కువయ్యాయి అంటూ విమర్శించారు నాగవంశీ. కొంతమంది టైటిల్ కార్డు నుండి ఎండ్ కార్డు వరకు రివ్యూలు ఇస్తున్నారు అని కామెంట్ చేశారాయన.
అంతేకాదు సినిమా విడుదలైన రోజే రివ్యూలు ఇచ్చేయకుండా… గతంలో మాదిరిగా ఒకట్రెండు రోజులు ఆగితే ఏమవుతుంది అని నాగవంశీ ప్రశ్నించారు. అయితే ఈ మాటలకు ఈ విషయమై ‘గుంటూరు కారం’ సినిమా విడుదల తర్వాత మాట్లాడదాం అని అనగా… ఆ సినిమాపై ఎలా రివ్యూలు తమకేం అభ్యంతరం లేదని చెప్పారు. ఎందుంకటే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అని ధీమాగా చెప్పారు నాగవంశీ. మహేష్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్‌లో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.