Namitha: ఆ వార్తలపై ఫైర్ అయిన నమిత భర్త!

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న హీరోయిన్లలో నమిత ఒకరు. సొంతం సినిమాతో నమిత టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై తొలి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. బాలకృష్ణకు జోడీగా నమిత నటించిన సింహా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే గత కొన్నేళ్ల నుంచి నమితకు సినిమా ఆఫర్లు తగ్గాయి. తమిళంలో నమితకు ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉంది. 2017 సంవత్సరంలో ఈ నటి వీరేంద్ర చౌదరిని మ్యారేజ్ చేసుకున్నారు.

ప్రముఖ బిజినెస్ మేన్, ప్రొడ్యూసర్ అయిన వీరేంద్ర చౌదరి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు మాత్రం ఇతను సుపరిచితమే. పెళ్లికి ముందు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నమిత పెళ్లి తర్వాత మాత్రం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. అయితే ఈ నటి సినిమాలలో నటిస్తున్న సమయంలో ఈమెకు సంబంధించి ఎన్నో రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. అలా వైరల్ అయిన రూమర్లలో శరత్ బాబు నమిత పెళ్లికి సంబంధించిన వార్త కూడా ఉంది.

శరత్ బాబు, నమిత మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ రూమర్ జోరుగా ప్రచారంలోకి వచ్చింది. ఈ రూమర్ గురించి తాజాగా నమిత భర్త వీరేంద్ర చౌదరి స్పందిస్తూ తనకు, నమితకు పెళ్లి జరిగే సమయంలో శరత్ బాబుతో నమిత పెళ్లి అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆ కామెంట్లు నా జీవితంలో నేను విన్న చెత్త కామెంట్లు అని అన్నారు. వయస్సులో చాలా పెద్ద వ్యక్తి అయిన శరత్ బాబుతో నమితకు ఎఫైర్ క్రియేట్ చేయడం చాలా పెద్ద తప్పు అని వీరేంద్ర చౌదరి అన్నారు.

ఆ రూమర్లు ఎందుకు వచ్చాయనే విషయం కూడా తనకు తెలియదని వీరేంద్ర చౌదరి తెలిపారు. అలాంటి వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వీరేంద్ర చౌదరి వెల్లడించారు. వీరేంద్ర చౌదరి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus