సూపర్ స్టార్ మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలను మోడల్ విలేజెస్ గా తీర్చిదిద్ధేందుకు అతని సతీమణి నమ్రత కృషి చేస్తున్నారు. ‘శ్రీమంతుడు’ సినిమా స్పూర్తితో కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామాన్ని, మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామాన్ని మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. రెండు గ్రామాల్లో రీసెంట్ గా పర్యటించిన నమ్రత అక్కడ కావలసిన మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. ఒక్కో వసతిని ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా సిద్ధాపురం గ్రామంలో చిన్నారులు అధునాతనమైన స్కూల్ నిర్మాణానికి ముప్పై లక్షలను అందజేశారు. నాట్కో ట్రస్టు ద్వారా వచ్చిన ఈ మొత్తాన్ని చెక్కురూపంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రఘునాథరెడ్డికి ఇచ్చారు.
అనంతరం నమ్రత మాట్లాడుతూ ‘‘పేద పిల్లల బాగుకోసం ఇంత విరాళాన్ని అందజేసినందుకు నాట్కో ట్రస్టుకు ధన్యవాదాలు. ప్రముఖ ఆర్కిటెక్ట్ సుధీర్ రెడ్డి పాఠశాల భవనం కోసం చక్కటి డిజైన్ రూపొందించారు. డ్రాఫ్ట్ అద్భుతంగా ఉంది. పాఠశాల నిర్మాణ పనుల్ని ఎప్పుడెప్పుడు మొదలుపెడదామా .. అని ఎదురు చూస్తున్నా. పిల్లలు ఇందులో చదువుకుని గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాం.’ అని చెప్పింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.