పన్నెండు ఏళ్ల తర్వాత నటిస్తున్న నమ్రత శిరోత్కర్
- February 11, 2017 / 08:08 AM ISTByFilmy Focus
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోత్కర్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. 1993లో మిస్ ఇండియా కిరీటం అందుకున్న ఈమె 1998 లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. హిందీ, మలయాళం, మరాఠీ, తెలుగు భాషల్లో మొత్తం 25 చిత్రాల్లో నటించారు. వంశీ చిత్రం సమయంలో ప్రిన్స్ ని ప్రేమించి 2005 (ఫిబ్రవరి 10 ) లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇంటికే పరిమితం అయ్యారు. మహేష్ వ్యవహారాలు, పిల్లలు గౌతమ్, సితారలను పెంపకంలోనే సమయాన్ని గడిపేశారు. ఇప్పుడు పిల్లలు పెద్దవారు కావడంతో తీరిక దొరికింది. దీంతో నమ్రత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.
నిన్న పెళ్లిరోజు సందర్బంగా హైదరాబాద్ లో జరిగిన వాణిజ్య కార్యక్రమంలో నమ్రత పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ఓ మల్టీ స్టారర్ మూవీలో నటిస్తున్నానని చెప్పారు. ఆ చిత్రం పేరు, ఏ భాషలో నిర్మితమవుతుంది అనే విషయాలను చెప్పడానికి నిరాకరించారు. పన్నెండు ఏళ్ల తర్వాత నమ్రత నటిస్తుండడంతో, ఆ సినిమా, పాత్ర వివరాలు తెలుసుకునేందుకు మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఈ ఒక్క చిత్రానికే పరిమితం అవుతారా? మరిన్ని సినిమా చేస్తారా? అని ఆరా తీస్తున్నారు. వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















