ఫ్యాషన్ ఐకాన్ గా మహేష్ భార్య నమ్రత
- February 15, 2017 / 10:18 AM ISTByFilmy Focus
యవ్వనంలో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న నమ్రత శిరోత్కర్, మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. తెలుగు సంప్రదాయాన్ని గౌరవిస్తూ సాధారణ గృహిణిలా పిల్లల్ని చూసుకోవడంలో గడిపేశారు. రెండు నెలల క్రితం శ్రీ వెంకటేశ్వరస్వామికి తలనీలాలలు సమర్పించారు. గుండుతోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఆమె స్టైల్ మార్చారు. ఫ్యాషన్ వేర్ ధరిస్తూ అమ్మాయిలా కనిపిస్తున్నారు. పెళ్లి అయిన వారికే కాకుండా యువతులకు ఫ్యాషన్ ఐకాన్ గా నిలుస్తున్నారు. ఈనెల 10 వ తేదీన హైదరాబాద్ లోని ఓ పెద్ద షాపింగ్ మాల్ లో జరిగిన ఈవెంట్ లో ఆమె మోడ్రన్ గా కనిపించి ఆకట్టుకున్నారు. నిన్న మరో ఈవెంట్ కి బాబ్ హెయిర్ కట్.. బెల్ బాటమ్ ప్యాంట్స్.. యాపిల్ కట్ షర్ట్ ధరించి నమ్రత హాజరయ్యారు.
ఫ్యాషన్ వేర్ లో ఆమెను చూసిన వారంతా వావ్ అన్నారు. సడన్ గా ఆమె స్టైల్ మార్చడం వెనుక బలమైన కారణం ఉంది. అదే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం. ఈ విషయాన్నీ స్వయంగా నమ్రత మీడియాకు చెప్పారు. తాను ఓ మల్టీ స్టారర్ మూవీలో నటిస్తున్నానని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. పెళ్లి అయిన తర్వాత సినిమాల్లో నటించాలంటే కేవలం చీరలోనే కనిపించాల్సిన రూల్ లేదు కదా.. అందుకే మోడ్రన్ లుక్ లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో కనిపించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















