నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) గోపీచంద్ మలినేని కాంబోలో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమా వచ్చింది. అది మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఆ సినిమాలో బాలకృష్ణని గోపీచంద్ ఎలివేట్ చేసిన విధానం ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. లుంగీ, బ్లాక్ షర్ట్..లో బాలయ్య రాయల్ లుక్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది.బాలయ్య డైలాగ్ డెలివరీ కూడా ఫ్యాన్స్ కి నచ్చింది. గోపీచంద్ బాలయ్యకి వీరాభిమాని కావడంతో ఆ రేంజ్లో చూపించాడని అంతా పొగిడేశారు.
అందుకే ఆ సినిమా రిలీజ్ టైంలోనే గోపీచంద్ తో మరో సినిమా చేస్తానని బాలయ్య హామీ ఇవ్వడం జరిగింది. మాటిచ్చినట్టుగానే గోపీచంద్ కి ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. ‘ఎస్ ఎల్ వి సినిమాస్’ లో ఈ ప్రాజెక్టు మొదలవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల ‘పెద్ది’ నిర్మాతలైన ‘వ్రిద్ది సినిమాస్’ వారికి వెళ్ళింది.’అఖండ 2′ తర్వాతే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు.

నయనతార హీరోయిన్ గా ఎంపికైంది. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. ఆ కారణాలు ఏంటా? అని ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. విషయంలోకి వెళితే.. ఈ ప్రాజెక్టుకి ఏకంగా రూ.200 కోట్ల వరకు బడ్జెట్ పెట్టాల్సి వస్తుందట. అది బాలయ్య మార్కెట్ కి మించిన బడ్జెట్. బాలయ్యపై రూ.200 కోట్లు బడ్జెట్ పెడితే.. థియేటర్ల నుండి రూ.100 కోట్లు వెనక్కి రావాలి. ‘అఖండ 2’ కి రూ.102 కోట్ల బిజినెస్ జరిగినప్పటికీ…తిరిగొచ్చింది కేవలం రూ.66 కోట్లే.
బాలయ్య కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ కూడా ‘డాకు మహారాజ్’ ఒక్కటే. అది కూడా రూ.79 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. ఈ కారణాలతోనే గోపీచంద్ మళ్ళీ తన రైటర్స్ తో కలిసి స్క్రిప్ట్ పై కూర్చున్నాడట. మళ్ళీ స్క్రిప్ట్ ని రీ-రైట్ చేసి అనవసరమైన పోర్షన్స్ ని ఫిల్టర్ చేశారట. అందువల్ల బడ్జెట్ కూడా కంట్రోల్ చేసే మార్గాలు తెలిశాయట. సంక్రాంతి ముగిశాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
