Breathe OTT: నందమూరి చైతన్యకృష్ణ సినిమాను ఓటీటీ ప్రేక్షకులు పట్టించుకుంటారా?

నందమూరి హీరో చైతన్యకృష్ణ నటించిన బ్రీత్ మూవీ గతేడాది డిసెంబర్ నెల 2వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై పరవాలేదనే స్థాయిలో అంచనాలు ఏర్పడినా యానిమల్ సినిమా రిలీజైన మరుసటి రోజే బ్రీత్ మూవీ రిలీజ్ కావడంతో ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో టాక్ మాత్రం రాలేదు. థియేటర్లలో హిట్ కాని ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా ఈ నెల 8వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.

ఆహా సంస్థ బ్రీత్ మూవీ స్ట్రీమింగ్ అవుతున్నట్టు పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. వంశీకృష్ణ ఆకెళ్ల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా వైదిక సెంజలియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. చైతన్య కృష్ణ 2003 సంవత్సరంలో విడుదలైన ధమ్ సినిమాలో నటించారు. దాదాపుగా 20 సంవత్సరాల గ్యాప్ తర్వాత చైతన్య కృష్ణ బ్రీత్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం.

బ్రీత్ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. చైతన్య కృష్ణ సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తారో లేదో తెలియాల్సి ఉంది. నందమూరి హీరోలలో బాలయ్యతో చైతన్యకృష్ణకు మంచి అనుబంధం ఉంది. బాలయ్య సినిమాలలో చైతన్య కృష్ణ నటిస్తే చైతన్యకృష్ణకు క్రేజ్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చైతన్యకృష్ణ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటే కెరీర్ పరంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

నందమూరి చైతన్యకృష్ణ బ్రీత్ (Breathe)  సినిమాకు థియేటర్లలో 40 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదలైందో కూడా చాలామంది ఫ్యాన్స్ కు తెలియదు. అయితే థియేటర్లలో ఫ్లాపైన సినిమాలు ఓటీటీలలో, బుల్లితెరపై హిట్టైన సందర్భాలు ఉన్నాయి. బ్రీత్ సినిమా కూడా ఆ జాబితాలో చేరుతుందేమో చూడాలి. నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను ఓటీటీలో కచ్చితంగా చూసే ఛాన్స్ అయితే ఉంది.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus