Kalyan Ram, Jr NTR: తారక్ నమ్మకాన్ని కళ్యాణ్ రామ్ నిలబెట్టుకుంటారా?

బింబిసార సినిమాపై ఒక్కరోజులో అంచనాలు పెరిగిపోయాయి. ఎన్టీఆర్ తాను బింబిసార సినిమాను చూశానని అభిమానులు కాలర్ ఎగరేసుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పడంతో నందమూరి అభిమానులు బింబిసార సినిమాను కచ్చితంగా చూడాలని భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సినిమాకు హిట్ టాక్ వస్తే భారీ కలెక్షన్లు రావడం సాధ్యమేనని అతనొక్కడే, పటాస్ సినిమాలు ప్రూవ్ చేశాయనే సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ ఖాతాలో హరే రామ్, 118 లాంటి యావరేజ్ హిట్లు సైతం ఉన్నాయి.

అయితే 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించే స్థాయిలో కళ్యాణ్ రామ్ ఖాతాలో ఒక్క సినిమా కూడా లేదు. అయితే బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ కోరిక నెరవేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల ఫలితాల విషయంలో కరెక్ట్ గానే చెబుతారు. అందువల్ల బింబిసార ఫలితం విషయంలో తారక్ ఫ్యాన్స్ సైతం కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో తారక్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

ప్రస్తుతం థియేటర్లలో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు అనుకూలంగా పరిస్థితులు లేవు. జులై నెలలో విడుదలైన మిడిల్ రేంజ్ హీరోల సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. బింబిసార మాత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమాకు హిట్ టాక్ వస్తే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడం కష్టమేమీ కాదు. దర్శకుడు మల్లిడి వశిష్ట కెరీర్ కు కూడా ఈ సినిమా కీలకమని చెప్పవచ్చు.

ఈ సినిమా సక్సెస్ ను సొంతం చేసుకుంటే మాత్రమే మల్లిడి వశిష్టకు సినిమా ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. దర్శకుడిని నమ్మి కళ్యాణ్ రామ్ ఏకంగా 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా కళ్యాణ్ రామ్ మార్కెట్ పెరుగుతోంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus