కళ్యాణ్ రామ్ మళ్ళీ రిస్క్ చేస్తున్నాడా?

‘కిక్ 2’ ‘ఇజం’ చిత్రాలతో నిర్మాతగా చాలా నష్టపోయాడు కళ్యాణ్ రామ్. ఆ నష్టాలను తీర్చుకోవడానికి తన తమ్ముడు ఎన్టీఆర్ తో ‘జై లవ కుశ’ అనే చిత్రం నిర్మించి చాలా వరకూ సేఫ్ అయ్యాడు. తనకు కథ నచ్చితే అందులో ఎంత రిస్క్ ఉన్నా సరే స్వయంగా తనే నిర్మించడానికి రెడీ అయ్యే కళ్యాణ్ రామ్… గత కొంత కాలంగా నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. తనకి 15కోట్ల వరకూ మార్కెట్ ఉంది కాబట్టి.. ఆ స్థాయిలోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ‘ఎం.ఎల్.ఎ’ వంటి ఎబౌవ్ యావేరేజ్ .. అలాగే ‘118’ వంటి డీసెంట్ హిట్లను అందుకున్నాడు .

‘ఎంత మంచి వాడవురా’ చిత్రం ప్లాప్ అయినప్పటికీ.. భారీ నష్టాలు అయితే రాలేదు అని వినికిడి. ప్రస్తుతం మల్లిడి వేణు డైరెక్షన్లో ‘తుగ్లగ్’ అనే సోసియో ఫాంటసి చిత్రంలో నటిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ సెట్ ను రామోజీ ఫిలింసిటీలో వేసారట. దీనికి 2కోట్ల వరకూ ఖర్చు అయ్యిందట. అయితే ఈ చిత్రాన్ని నిర్మించడానికి మొదట వేరే నిర్మాత ముందుకు వచ్చాడట. కానీ బడ్జెట్ ఎక్కువైపోతుందని భావించి అతను సైడ్ అయ్యి పోయినట్టు టాక్. ఈ క్రమంలో కళ్యాణ్ రామే నిర్మించాలని డిసైడ్ అయ్యాడు. అయితే 2 కోట్లు పెట్టి సెట్ వేసిన వారం రోజులకే వైరస్ మహమ్మారి కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది.

వెంటనే ఆ సెట్ ను తీసేసారట. మళ్ళీ అక్కడే ఉంచితే రెంట్ లు కట్టాల్సి వస్తుందని ఆ సెట్ ను తీసేసారట..! ఇప్పటికి 4 నెలలు గడిచినా షూటింగ్ తిరిగి ప్రారంభం కాలేదు. 4 నెలల రెంటు మిగిలిందని సంతోషపడాలా లేదా 2 కోట్లు నష్టం వచ్చిందని బాధపడాలో అర్ధం కావడం లేదని ఇటీవల కళ్యాణ్ రామ్ తన సన్నిహితులకు చెప్పుకున్నాడని తెలుస్తుంది. నిర్మాణం అంటే అంతే మరి.. ఇప్పుడు ఈ సినిమా నిర్మించడానికి కమిట్ అయ్యి కళ్యాణ్ రామ్ రిస్క్ చేస్తున్నాడా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది పూర్తయ్యాక ‘ఎన్టీఆర్ 30’ కి కూడా కళ్యాణ్ రామ్ సహా నిర్మాతగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus