నందమూరి తారకరత్నమరణ వార్త ఒక్కసారిగా చిత్ర పరిశ్రమను ఎంతో దిగ్బ్రాంతికి గురిచేసింది. ఇలా చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈయన మరణ వార్త విని ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో ఈయనని గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఇలా రోజురోజుకు ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఈయన చివరికి తుది శ్వాస విడిచారు. ఈ విధంగా తారకరత్న మరణ వార్త అందరిని ఎంతగానో కలచివేసింది. ఈయన మరణించిన అనంతరం తారకరత్నకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తారకరత్న తన చివరి కోరిక తీరకుండానే మరణించారని పలువురు ఎంతో దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
తారకరత్న సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ వచ్చారు. అలాగే మరోవైపు రాజకీయాలలోకి రావడానికి ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఈయన వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీ స్థానంలో పోటీ చేయబోతున్నానంటూ ప్రకటించారు.ఇలా ప్రకటించిన అనంతరం పార్టీ కార్యకలాపాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.
ఈ క్రమంలోనే తారకరత్న వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయబోతున్న తరుణంలో పార్టీ తరపున ప్రచారం చేస్తూ పాదయాత్రలో లోకేష్ కు మద్దతు తెలిపారు.అయితే ఈ పాదయాత్రలో భాగంగా ఈయన స్పృహ తప్పి పడిపోవడం అనంతరం మరణించడం జరిగింది దీంతో తారకరత్న చివరి కోరిక తీరకుండానే మరణించారని అభిమానులు పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.