నందమూరి తారకరత్న… నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాద యాత్రలో గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే కుప్పంలోని కేసి ఆసుపత్రికి తరలించారు. తారకరత్న కండిషన్ క్రిటికల్ గా ఉన్న తరుణంలో అక్కడి వైద్య బృందం ఇతన్ని బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు.గత రెండు రోజులుగా తారకరత్న స్పృహలోకి వచ్చింది లేదు. నిన్నటి వరకు పరిస్థితి క్రిటికల్ అని చెప్పారు. కానీ బాలకృష్ణ,మనోజ్ వంటి వారు తారకరత్న కోలుకుంటున్నాడు
అంటూ చెప్పడంతో ఈరోజుకు అతను పూర్తిగా కోలుకుంటాడు అని అంతా భావించారు. కనీసం స్పృహలోకి అయినా వస్తాడు అని భావించారు. కానీ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు అని తాజా బులెటిన్ తో స్పష్టమవుతుంది. నందమూరి తారకరత్న హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనే విషయం పై బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు తాజాగా ఓ హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. దీని ద్వారా వారు స్పందిస్తూ.”తారకరత్న పరిస్థితి విషమంగానే ఉంది.వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నాం.
ఎలాంటి ఎక్మో సపోర్ట్ పెట్టలేదు.కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తున్నాం” అంటూ తెలియజేశారు. తారకరత్న పరిస్థితి ఏమాత్రం సంతోషించే విధంగా లేదు. అతను స్పృహలోకి వస్తే అంతా ఊపిరిపీల్చుకుంటారు.అతని బాబాయ్ బాలకృష్ణ.. తారకరత్న కోలుకోవాలని నిద్రాహారాలు మానేసి మరీ హాస్పిటల్ వద్ద పడుంటున్నాడు.వైద్య బృందం కూడా అహర్నిశలు ప్రయత్నిస్తుంది.
ఏమాత్రం చిన్న పాజిటివ్ రియాక్షన్ అందినా కుటుంబ సభ్యులకు తెలిపేందుకు సిద్ధంగా ఉంది.తారకరత్న శరీరం ట్రీట్మెంట్ కు రెస్పాండ్ అవుతుంది. కాకపోతే మెదడు పనిచేయడం ఇంకా మొదలుకాలేదని తెలుస్తుంది.