Nani: ఆ సినిమా నా యాక్టింగ్‌ నాకే నచ్చలేదు: నాని షాకింగ్ కామెంట్స్‌!

టైటిల్‌ చూసి తను చేసిన సినిమాలో తన యాక్టింగ్‌ నచ్చకపోవడమేంటి? ‘నాని (Nani) ఇలా ఎందుకు అంటాడు?’ అని మీరు అనుకోవచ్చు. కానీ అలా అనుకుంటూ కొత్త సినిమాలు చేస్తున్నాడు కాబట్టే ఇప్పుడు పాన్‌ ఇండియా లెవల్‌ సినిమాలు చేస్తున్నాడు, మన దగ్గర చేసిన ప్రతి సినిమాతో దాదాపు విజయం అందుకుంటున్నాడు. ఇక అసలు విషయానికొస్తే నిజంగానే నానికి తన సినిమాలో చేసిన యాక్టింగ్‌ నచ్చలేదట. అయితే అది ఇప్పటి సినిమా కాదు. ఎప్పుడో పదేళ్ల క్రితం నాటి సినిమా.

Nani

పదేళ్ల నాటి సినిమా అనగానే వికీపీడియాలోకి వెళ్లి వెతికేయొద్దు. ఆ సినిమా ఏంటో మేమే చెప్పేస్తాం. నాని, విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)  ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ (Yevade Subramanyam) సినిమానే అది. నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా విడుదలై 10 ఏళ్లు అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ సినిమా టీమ్‌ అంతా ఓ రీయూనియన్‌ పెట్టుకున్నారు. అప్పుడే సినిమా ప్లే చేస్తే మళ్లీ చూశాడట. అప్పుడే అందులో యాక్టింగ్‌ నచ్చలేదని అనిపించిందట. అయితే అది కొన్ని సన్నివేశాల్లోనేనట.

కొన్ని సీన్స్‌ చూస్తున్నప్పుడు ఇంకా బాగా చేసి ఉండాల్సింది అని అనుకున్నాను అని చెప్పాడు నాని. ఇక ఆ సినిమా రోజుల గురించి, టీమ్‌ గురించి కూడా మాట్లాడాడు. విజయ్‌, తాను, నాగ్‌ అశ్విన్‌ ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నామని చెపన్పిన నాని.. పదేళ్ల తర్వాత టీమ్‌ అంతా ఒకేచోట కలవడం ఆనందంగా అనిపించిందని తెలిపాడు. అంతా ఓ స్కూల్‌ రీయూనియన్‌లా అనిపించిందని, సినిమా కోసం వర్క్‌ చేసిన వాళ్లు చాలా మంది పెద్దవాళ్లు అయ్యారని అందుకే ఆ ఫీల్‌ కలిగింది అని అన్నాడు.

ఇక నాని సినిమాల గురించి చూస్తే.. ‘హిట్‌ 3’ (HIT 3)  సినిమాతో మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రెండు ‘హిట్‌’లూ భారీ విజయం అందుకున్న నేపథ్యంలో, మూడో ‘హిట్‌’ ప్రచార చిత్రాలు బాగుండటంతో మొత్తంగా సినిమా గురించి టాలీవుడ్‌ ఎదురుచూస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus