“నాని ఇంక ఇలాంటి సినిమాలే తీస్తాడా?” అని అందరూ తిట్టుకొంటున్న తరుణంలో “జెర్సీ”తో తాను కంటెంట్ ఉన్న సినిమాలు చేయగలను అని నిరూపించాడు నాని. కానీ.. నాని చేసిన “మిడిల్ క్లాస్ అబ్బాయి” లాంటి రొటీన్ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులు.. “జెర్సీ”ని మాత్రం గాలికొదిలేశారు. అందువల్ల “మిడిల్ క్లాస్ అబ్బాయి” వసూలు చేసిన మొత్తంలో 70% కూడా “జెర్సీ” వసూలు చేయలేకపోయింది. దాంతో తెలుగు ప్రేక్షకులకు కంటెంట్ కంటే ఎంటర్ టైన్మెంట్ ఎక్కువ ఇంపార్టెంట్ అని అర్ధమైంది.
ఇదే విషయమై “గ్యాంగ్ లీడర్” ప్రమోషన్స్ లో భాగంగా నానిని ప్రశ్నించగా.. “నేను రొటీన్ సినిమాలు చేస్తున్నాను అని క్రిటిక్స్ తిట్టారు. కానీ ఆడియన్స్ ఆ సినిమాలే ఎక్కువగా చూస్తున్నారు. జెర్సీ తప్పకుండా బ్లాక్ బస్టర్ సినిమానే కానీ మిడిల్ క్లాస్ అబ్బాయి రేంజ్ కలెక్షన్స్ మాత్రం వసూలు చేయలేకపోయింది. అయితే.. గ్యాంగ్ లీడర్ మాత్రం ఆ లోటు తీరుస్తుంది అనుకొంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా కొత్తగా ఉండడమే కాదు.. చాలా ఎంటర్ టైనింగ్ గా కూడా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు నాని.