నిర్మాతగా ఫెయిల్ అయిన హీరో నాని

ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నాని, మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అష్టా చెమ్మా చిత్రంతో హీరోగా మారాడు. ఆ చిత్రం విజయం సాధించడంతో హీరోగా అవకాశాలు అందుకున్నాడు. స్నేహితుడు, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, పిల్ల జమిందార్ చిత్రాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం నాని టు టైర్ హీరోలలో టాప్ పోజిషన్ లో ఉన్నాడు. ఇక 2018లో నాని నిర్మాతగా కూడా మారాడు. వాల్ పోస్టర్ సినిమా పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ అయన స్థాపించడంతో పాటు, ‘అ’ అనే ఓ ప్రయోగాత్మక చిత్రం తెరకెక్కించారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 66వ జాతీయ అవార్డ్స్ లో ఈ మూవీ బెస్ట్ మేక్ అప్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాలలో రెండు అవార్డ్స్ గెలుపొందింది. ఐతే సినిమా వసూళ్ల పరంగా వెనుకబడింది. ఈ మూవీకి మంచి రేటింగ్స్ వచ్చినా వసూళ్లు మాత్రం ఆ స్థాయిలో అందలేదు. ఇక ఈ ఏడాది నాని మరో చిత్రం నిర్మించాడు. విశ్వక్ సేన్ హీరోగా హిట్ అనే క్రైమ్ థ్రిల్లర్ నిర్మించడం జరిగింది.

శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం విశేషం. ఐతే హిట్ మూవీ కూడా వసూళ్ల పరంగా నిర్మాతలను సంతృప్తి పరచలేదు. ఈ మూవీకి వచ్చిన టాక్ కి వసూళ్లకు సంబంధం లేకుండా పూర్ కలెక్షన్స్ దక్కాయి. నిర్మాతగా హిట్ మూవీ సైతం నానికి డబ్బులు తెచ్చిపెట్ట లేకపోయింది. దీనితో నిర్మాతగా నాని మొదటి రెండు ప్రయత్నాలు సఫలం కాలేదు. దీనితో భవిష్యత్తులో నాని సినిమాలు తీస్తాడా అనే సందేహం మొదలైంది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus