హలో బ్రదర్ కధతో వస్తున్న నాని!!
- July 21, 2017 / 07:14 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో యువ హీరోల్లో దూసుకుపోతున్న యువ కెరటం నాని…ఒకటి కాదు…రెండు కాదు…వరుసగా 7సినిమాతో సూపర్ డూపర్ హిట్స్ అందుకుని డబల్ హ్యాట్రిక్ ని ఆస్వాదిస్తూ తన నెక్స్ట్ సినిమాపై పూర్తి ఫోకస్ తో ఉన్నాడు నాని… ఇప్పటికీ ఖాళీ లేకుండా మరో రెండు సినిమాలకు సైన్ చేసిన నాని…తన నెక్స్ట్ సినిమాని వేణు శ్రీరాం డైరక్షన్ లో ఎం.సి.ఏ గా ఆల్‌రెడీ స్టార్ట్ చేసేసాడు…ఇదిలా ఉంటే…మరో పక్క మేర్లపాక గాంధి దర్శకత్వంలో నాని ఒక సినిమా చేస్తున్నాడు…ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది… ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు టోటల్ టాలీవుడ్ గుసగుసలు ఆడుతుంది…దానికి కారణం ఈ సినిమా కధ లీక్ కావడమే…అసలు మ్యాటర్ ఏంటి అంటే….మేర్లపాక గాంధి డైరక్షన్ లో కృష్ణార్జున యుద్ధం సినిమాలు చేస్తున్నాడు నాని…ఇక ఈ సినిమా టైటిల్ గా కృష్ణార్జున యుద్ధం అని పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అంటే… సినిమాలో కృష్ణ, అర్జున్ లుగా డ్యుయల్ రోల్ చేయబోతున్నాడట నాని.
ఇక ఒక పాత్ర తిరుపతిలో ఉంటుందని.. మరో పాత్ర ప్యారిస్ లో ఉంటుందని తెలుస్తుంది. ఒక పాత్ర మాస్.. మరో పాత్ర క్లాస్ గా ఉంటుందట. ఈ రెండు పాత్రలకు రెండు కథలు.. రెండు ట్విస్టులు ఉంటాయని తెలుస్తుంది. హలో బ్రదర్ తరహాలో ఈ సినిమా ఉండబోతుందని టాక్. అయితే ఈ సినిమాలో అసలైన ట్విస్ట్ మరొటి ఉన్నదట అదేంటి అన్నది మాత్రం సస్పెన్స్ అంటున్నారు. సినిమాకు సంబందించిన మరిన్ని విషయాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కధ ఇప్పటికే లీక్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా 2018 ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వనుందని సమాచారం…మరి ఆ సస్పెన్స్ ఎంతో మనకు తెలియాలి అంటే అప్పటి వరకూ ఆగాల్సిందే మరి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














