Nani Remuneration: దసరా సినిమా విషయంలో నాని నిర్ణయమిదేనా?

Ad not loaded.

కొన్నేళ్ల క్రితం నాని నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే ఈ మధ్య కాలంలో హీరోగా నాని పరిస్థితి అస్సలు బాలేదు. నాని ఏ సినిమాలో నటించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించడంలో ఫెయిలవుతోంది. వి, టక్ జగదీష్ సినిమాలు ఓటీటీలలో విడుదల కాకుండా థియేటర్లలో రిలీజై ఉంటే మాత్రం నిర్మాతలకు భారీ నష్టాలు మిగిలేవి. అయితే నాని ప్రస్తుతం దసరా సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు నాని రెమ్యునరేషన్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం దసరా సినిమాకు నాని రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని బోగట్టా. ఈ సినిమాకు జరిగే బిజినెస్ ఆధారంగా నాని తన రెమ్యునరేషన్ ను తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. లాభాలు వస్తే నానికి ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ లభించే ఛాన్స్ అయితే ఉంది. నాని ప్రస్తుతం ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. కొంతమంది సీనియర్ స్టార్ హీరోల పారితోషికంతో పోల్చి చూస్తే ఈ మొత్తం ఎక్కువ కావడం గమనార్హం.

అయితే ఒక్క సక్సెస్ దక్కితే నాని కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు. యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం వల్లే నానికి చేదు ఫలితాలు ఎదురవుతున్నాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. నాని సొంతంగా చిన్న సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత పడే కష్టాలు నానికి కూడా తెలుసు కాబట్టి దసరా రెమ్యునరేషన్ విషయంలో నాని ఈ తరహా నిర్ణయాలను తీసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు నాని కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడటం లేదు. దసరా సినిమా తర్వాత నాని నటించే ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus