‘ఎవడే సుబ్రమణ్యం’ మొదలుకొని మొన్న వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ వరకూ అపజయమన్నది ఎరుగక విజయవిహారం చేస్తున్న నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి రూపొందించిన సినిమా “అ!”. నిత్యామీనన్, కాజల్, ఈష, మురళీశర్మ, ప్రియదర్శి వంటి క్రేజీ ఆర్టిస్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ప్రశాంత్ వర్మ అనే యువ ప్రతిభాశాలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటివరకూ విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమా మీద విపరీతమైన క్రేజ్ ను పెంచాయి. చిత్రాన్ని ముందు ఫిబ్రవరి 2న విడుదల చేద్దామనుకొన్నారు.
కానీ.. అనూహ్యంగా జనవరి 26న ఏకంగా అయిదు సినిమాలు, ఫిబ్రవరి 9న ఆరు తెలుగు సినిమాలు విడుదలకు రెడీ అవ్వడంతో మధ్యలో తన “అ!” చిత్రాన్ని విడుదల చేయడం ఏమాత్రం సరికాదని భావించాడు నాని. అలాగే.. ట్రేడ్ విశ్లేషకులు కూడా నానికి ఓన్ ప్రొజెక్ట్ తో రిస్క్ చేయొద్దని చెప్పడంతో “అ!” చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసి ఫిబ్రవరి లేదా మార్చిలో చిత్రాన్ని విడుదల చేద్దామని ఫిక్స్ అయ్యాడట.
ఇకపోతే.. నాని హీరోగా నటిస్తున్న “కృష్ణార్జున యుద్ధం” ఏప్రిల్ రిలీజ్ కి రెడీగా ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్రాన్ని మార్చిలోనే విడుదల చేయాలి, కానీ మార్చిలో ఇండస్ట్రీ బంద్ ప్రకటించించి. దాంతో ఏం చేయాలో పాలుపోని పొజిషన్ లో ఉన్నాడు నాని.