రొటీన్ కథతో నాని సినిమా!

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ పెడుతోన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఆయన నటించిన ‘వి’ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ తరువాత ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను పూర్తి చేయనున్నాడు. ఆ తదుపరి సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ తో చేయనున్నాడు. ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ‘అంటే.. సుందరానికీ!’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు.

ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.. కథ ప్రకారం నాని ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి. సంప్రదాయాలు, కట్టుబాట్ల విషయంలో పక్కాగా ఉంటాడు. అలాంటి అబ్బాయి.. ఓ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఇంట్లో మాత్రం తను ప్రేమించింది బ్రాహ్మణ అమ్మాయినే అని చెబుతాడు.

దీంతో బ్రాహ్మణులు ఎలా ఉంటారు..? వారి వేషభాషలేంటి..? అనే విషయాల్లో తను ప్రేమించిన అమ్మాయికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి ఇంటికి తీసుకొస్తాడు. అక్కడ నుండి ఏం జరిగిందనే విషయాలతో కథ ఉంటుందట. ప్రేమలో కుల, మతాల ప్రస్తావన ఉంటూనే ఉంటుంది. అదే విషయాన్ని ఎంటర్టైన్మెంట్ వేలో చూపించడానికి దర్శకుడు ప్రయత్నిస్తున్నాడట. అయితే ఇలాంటి కథతో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. రొటీన్ కథ అయినప్పటికీ వినోదంగా తెరకెక్కిస్తే వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాని కామెడీ టైమింగ్ కూడా కథకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి!

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus