Hero Nani: శ్యామ్ సింగరాయ్ కు భారీ డీల్!

నాచురల్ స్టార్ నాని గత రెండు సినిమాలను కూడా డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదల చేసిన విషయం తెలిసిందే. v సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీష్ సినిమా కూడా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో ని విడుదలైంది.. ఇక ఈ సారి మాత్రం శ్యామ్ సింగరాయ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సక్సెస్ కొట్టాలని నాని పవర్ఫుల్ గా సిద్ధమవుతున్నాడు. శ్యామ్ సింగరాయ్ సినిమా సౌత్ ఇండస్ట్రీ దాదాపు అన్ని భాషల్లోనూ విడుదల అవుతోంది.

తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో కూడా డిసెంబర్ 24న ఒకేసారి విడుదల కాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం. ఇంకా క్లోజ్ కావాల్సిన డీల్స్ అయితే చాలానే ఉన్నాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా కూడా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. B4U ఛానెల్ శ్యామ్ సింగరాయ్ సినిమా హీంది డబ్బింగ్ హక్కులను 10కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.

ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. నాని ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus