‘వి’ ఫలితం ఆ రెండు సినిమాలకు పెద్ద సమస్యలే తెచ్చిపెట్టిందే..!

దిల్ రాజు నిర్మాణంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో నాని, సుధీర్ బాబు లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వి’. టీజర్ విడుదలైన దగ్గర నుండీ.. ‘వి’ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసారు. మార్చి 25న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చెయ్యాలి అనుకున్నారు దర్శకనిర్మాతలు. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల థియేటర్లు మూతపడటంతో అది వర్కౌట్ కాలేదు. ఇక థియేటర్లు ఇప్పట్లో తెరుచుకోలేని నేపథ్యంలో సెప్టెంబర్ 5న ‘వి’ ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు.

కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో లేదనే టాక్ మొదలైంది. మొదటి మూడు రోజులు ఈ చిత్రాన్ని బాగానే చూసారు ప్రేక్షకులు. అయితే సోమవారం నుండీ ఈ చిత్రాన్ని ఎంతమంది చూస్తారు? అనేది ప్రశ్నర్ధకంగా మారింది. 33కోట్లకు ఈ చిత్రాన్ని అమెజాన్ వారు కొన్నారు. ఈ క్రమంలో ‘వి’ బాటలోనే ‘నిశ్శబ్దం’ ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి క్రేజ్ ఉన్న చిత్రాలను కూడా ఓటిటిలోనే విడుదల చెయ్యడానికి రెడీ అయ్యారు ఆ చిత్రాల దర్శకనిర్మాతలు. ఓటిటిల్లో విడుదల చెయ్యడం వల్ల లాభాలు వస్తాయో లేదో అన్న విషయాన్ని పక్కనపెడితే..పెట్టిన బడ్జెట్ మాత్రం తిరిగొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

అందుకే ‘నిశ్శబ్దం’ ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి చిత్రాల దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. లాభాల కోసం అయితే శాటిలైట్ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్ వంటివి మిగిలే ఉన్నాయి. అయితే.. ‘వి’ చిత్రం ఫలితం వల్ల ఇప్పుడు ఈ రెండు చిత్రాలకు పెద్ద సమస్యలు వచ్చి పడ్డాయట.’నిశ్శబ్దం’ ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాలకు.. ముందు చెప్పిన రేటు కంటే కూడా ఇప్పుడు 20శాతం తగ్గించి చెబుతున్నాయట అమెజాన్,జీ5 వంటి ఓటిటి సంస్థలు. దాంతో ఈ చిత్రాల నిర్మాతలు మళ్ళీ డైలమాలో పడినట్టు సమాచారం.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus