నాని ‘వి’ మూవీలో క్లైమాక్స్ ట్విస్ట్ అదేనట..!

నాని 25వ చిత్రంగా తెరకెక్కుతున్న వి మూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి, నాని లది హిట్ కాంబినేషన్ కావడంతో పాటు, ఈ మధ్య విడుదలైన నాని లుక్ కూడా సినిమాపై ఆసక్తిరేపింది. చేతిలో నెత్తురుతో తడిసిన కత్తెరతో ఆయన సీరియస్ లుక్ ఆసక్తిరేపుతోంది. కాగా వి చిత్రంలో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న సీరియస్ కిల్లర్ గా కనిపిస్తాడని సమాచారం. ఐతే ఈ చిత్రంలో దర్శకుడు మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ట్విస్ట్ సిద్ధం చేశారట. సినిమా చివరి వరకు నెగెటివ్ క్యారెక్టర్స్ గా ఉన్న పాత్రలు…పాజిటివ్ గా, పాజిటివ్ గా ప్రొజెక్టు అయిన పాత్రలు నెగెటివ్ గా టర్న్ అవుతాయట.

ముఖ్యంగా నాని, సుధీర్ పాత్రలు ద్వారా దర్శకుడు ఇచ్చే ట్విస్ట్ ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. నాని, మోహనకృష్ణ ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అని ఇండస్ట్రీ టాక్. గతంలో నాని డెబ్యూ మూవీ అష్టా చెమ్మా, అలాగే జెంటిల్ మెన్ చిత్రాలు విజయం సాధించాయి. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus