Naresh: ‘మళ్ళీ పెళ్లి’ లో పవిత్రతో లిప్ లాక్ పై నరేష్ స్ట్రైట్ కామెంట్స్..!

సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్ర ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇద్దరూ ప్రస్తుతం సహజీవనంలో ఉన్నారు. నరేష్ .. పవిత్రను పెళ్లి చేసుకోవడానికి అతని మూడో భార్య రమ్య రఘుపతి ఒప్పుకోవడం లేదు కాబట్టి వీళ్ళు పెళ్లి చేసుకోలేదు. రమ్య రఘుపతి అయితే నాకు కొడుకు ఉన్నాడు కాబట్టి, నా భర్త నాకు కావాలి అంటున్న సందర్భాలు కూడా చూశాం. సరే అవన్నీ ఎందుకు అని..

నరేష్ – పవిత్ర కలిసి ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా చేశారు. ఫస్ట్ లుక్ నే ఓ లిప్ లాక్ తో వదిలారు. అయితే అది వీళ్ళు సినిమాలో నటిస్తున్నట్లు కాకుండా.. నిజంగా పెళ్లి చేసుకుంటున్నట్టు.. రివీల్ చేశారు. ఫైనల్ గా అది సినిమా కోసం అని తెలిసింది. అయినప్పటికీ 60 ఏళ్ళ వయసులో నరేష్ .. లిప్ లాక్ చేయడం ఏంటి? ఈ వయసులో అతను ప్రజెంట్ జనరేషన్ కు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే కామెంట్స్ వినిపించాయి. ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈ విషయంపై నరేష్ (Naresh) స్పందించారు. ‘మళ్ళీ పెళ్లి’ ప్రమోషన్స్ లో భాగంగానే ఆయన ‘ 20 ఏళ్ళ వయసు వాళ్ళే లిప్ లాక్ చేసుకోవాలా? 60 ఏళ్ళ వయసుంటే లిప్ లాక్ చేసుకోకూడదా?’ అంటూ మండిపడుతూ ప్రశ్నించారు. ‘అలాగే సెకండ్ ఇన్నింగ్స్ అనేది బాగుండాలి. ఓ మంచి తోడు ఉండాలి.. అని చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం.

ప్రేమని ఏ వయసులో ఉన్నవారైనా.. ఎలాగైనా వ్యక్తపరచొచ్చు’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పవిత్రకి మాత్రమే కాదు గతంలో ‘చందమామ కథలు’ సినిమాలో కూడా ఆమనికి నరేష్ లిప్ లాక్ పెట్టారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus