ఏపీలో భీమ్లా నాయక్ మూవీ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏపీలో 55 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే హిట్ అనిపించుకుంటుంది. అయితే ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న టికెట్ రేట్లకు ఈ మొత్తం సాధించడం సులువైన విషయం కాదు. భీమ్లా నాయక్ కు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నట్టి కుమార్ మాట్లాడుతూ రెవిన్యూ సిబ్బంది సస్పెండ్ అయిన జీవో నంబర్ 35 ప్రకారం టికెట్లను అమ్మాలని ఎగ్జిబిటర్స్ ను బెదిరిస్తున్నారని ఈ విషయంలో ఫిల్మ్ ఛాంబర్ కు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం తనిఖీలు చేయడం తప్పుకాదని రద్దైన జీవో రేట్లకు టికెట్లను అమ్మమని చెప్పడం మాత్రం తప్పని నట్టి కుమార్ కామెంట్లు చేశారు. అన్ అఫీషియల్ గా థియేటర్ల యజమానులను ఇబ్బంది పెట్టవద్దని కోరుతున్నానని నట్టి కుమార్ అన్నారు.
ఎగ్జిబిటర్లను బెదిరిస్తే న్యాయపరమైన చర్యలకు వెళతారని నట్టి కుమార్ వెల్లడించారు. కొత్త రేట్లను అమలు చేయాలని కోరుతున్నామని తెలంగాణ సర్కార్ నుంచి సహకారం అందుతోందని ఏపీ ప్రభుత్వం కూడా సహకారం అందిస్తే బాగుంటుందని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కోర్టు జీవో 35ను పక్కన పెట్టిందని టికెట్ రేట్ల విషయంలో త్వరలో కొత్త జీవో ఇస్తామని చెప్పారని నట్టి కుమార్ పేర్కొన్నారు. జీవో 35ను అమలు చేయవద్దని ప్రసన్నకుమార్ కోరారు.
సినిమా వాళ్లు వేర్వేరు పార్టీలలో ఉంటారని తమపై రాజకీయం చేయవద్దని ప్రసన్న కుమార్ వెల్లడించారు. సినిమాలపై లక్షల సంఖ్యలో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అధికారులు రాజ్యాంగబద్ధంగా వెళ్లాలని ఆదేశాలు జారీ చేయాలని ప్రసన్న కుమార్ చెప్పుకొచ్చారు. జీవో 100ను అయినా అమలుపరచాలని ప్రసన్న కుమార్ కోరడం గమనార్హం.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!