Nani: ఈ టైంలో ఇలాంటి కామెంట్స్ అవసరమా నాని..!

కొన్ని గంటల ముందు నాని నటించిన ‘దసరా’ టీజర్ రిలీజ్ అయ్యింది. నాని కెరీర్లోనే ఇలాంటి మాస్ సినిమా రాలేదు. అలాగే నాని నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. మార్చి 30న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇది పాన్ ఇండియా సినిమా అని కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు.. ఇండియాలో ఉన్న ప్రతి సినీ ప్రేమికుడికి తెలిసేలా…

తెలుగు టీజర్ ను దర్శకధీరుడు రాజమౌళితో, హిందీ టీజర్ ను షాహిద్ కపూర్ తో, తమిళ టీజర్ ను ధనుష్ తో, కన్నడ టీజర్ ను రక్షిత్ శెట్టి తో, మలయాళం టీజర్ ను దుల్కర్ సల్మాన్ తో రిలీజ్ చేయించారు. ఇక మల్లారెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ లో నాని మాట్లాడుతూ.. ” ‘దసరా’ నాకు చాలా స్పెషల్ మూవీ. మార్చి 30 న మీరంతా ‘దసరా’ గురించి మాట్లాడుకుంటారు. అది తప్పితే మరో టాపిక్ ఉండదు. చాలా సార్లు తెలుగు సినిమాకి నా కాంట్రిబ్యూషన్ ఏమిటని ఆలోచించే వాడిని.

ఇప్పుడు చాలా గర్వంగా ఒక మాట చెబుతున్నాను. తెలుగు, ఇండియన్ సినిమాకి నా కాంట్రిబ్యూషన్.. శ్రీకాంత్ ఓదెల. ఇది ఎందుకు చెప్తున్నానో, శ్రీకాంత్ ఎలాంటి సినిమా తీశాడో… మీకు మార్చి 30న తెలుస్తుంది. టీజర్ జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమా అదిరిపోతుంది.. నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. గత ఏడాది తెలుగు సినిమా నుండి ఆర్ఆర్ఆర్ ,కన్నడ నుండి కేజీఎఫ్, కాంతార వచ్చాయి. చాలా నమ్మకంగా చెబుతున్నాను.. 2023లో తెలుగు సినిమా నుండి ‘దసరా’ వస్తుంది.ఈ మాట గుర్తుపెట్టుకోండి మార్చి 30న తెలుస్తుంది’’

అంటూ ‘దసరా’ ని ఆకాశానికి ఎత్తేశాడు నాని. అయితే నాని గత సినిమా ‘అంటే సుందరానికి’ పెద్దగా ఆడలేదు. ఆ సినిమా విషయంలో కూడా నాని ఇలాగే కాన్ఫిడెంట్ గా చెప్పాడు. కానీ ఫలితం తేడా కొట్టింది. మరి ఇలాంటి టైంలో ‘దసరా’ గురించి నాని ఇంత కాన్ఫిడెంట్ గా ఇలాంటి కామెంట్స్ చేస్తే జనాలు నమ్ముతారా. పైగా నాని కెరీర్లో ఏకంగా రూ.75 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. పైగా ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ నుండి వచ్చిన సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ అయ్యింది లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus