నవదీప్ (Navdeep) ‘2.ఓ’ అంటూ ‘లవ్ మౌళి’ (Love Mouli) సినిమా వచ్చింది. వాస్తవానికి నవదీప్ చాలా సార్లు ఈ 2.ఓ భజన చేశాడు. ‘జై’ (Jai) నుండి ‘మొదటి సినిమా’ వరకు అతను హీరోగా చేసిన సినిమాలు ఒక ఎత్తు. కానీ ‘చందమామ’ (Chandamama) ఇంకో ఎత్తు. ఆ టైంలో అది 2.ఓ అనుకున్నాడు నవదీప్. ‘చందమామ’ హిట్ వల్ల అతనికి కలిసొచ్చింది ఏమీ లేదు. ఆ తర్వాత నవదీప్ చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అనూహ్యంగా ‘ఆర్య 2 ‘ (Arya 2) లో ఛాన్స్ దక్కించుకున్నాడు.
అది అతని 2.ఓ అనుకున్నాడు. ‘ఆర్య 2 ‘ వల్ల కూడా నవదీప్ కి కలిసొచ్చింది ఏమీ లేదు. కొన్నాళ్ళకి ‘బిగ్ బాస్’ లో ఎంట్రీ ఇచ్చి.. అది నవదీప్ 2.ఓ అనుకున్నాడు. అది కలిసి రాలేదు. గతేడాది ‘న్యూసెన్స్’ (Newsense) అనే వెబ్ సిరీస్ చేసి అది 2.ఓ అన్నాడు. మళ్ళీ ‘లవ్ మౌళి’ అతనికి 2.ఓ అంటూ చెప్పాడు. ఇది కూడా అతనికి 2.ఓ కాలేదు అని బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
‘లవ్ మౌళి’ లో అతని వేషధారణ, ఎక్స్పోజింగ్ సీన్స్, బెడ్ రూమ్ సీన్స్.. వీటితో జనాలని ఆకర్షించాలి అనుకున్నట్టు ఉన్నాడు నవదీప్. కానీ అది కూడా కమర్షియల్ గా ఇతనికి కలిసి రాలేదు. వైజాగ్ లో వేసిన ప్రీమియర్ షో హౌస్ ఫుల్ అయ్యింది.దానికి నెగిటివ్ టాక్ వచ్చింది. నిన్న అంటే రిలీజ్ రోజున కనీసం ఏ థియేటర్లో కూడా 10 శాతం ఆక్యుపెన్సీ కూడా రిజిస్టర్ కాలేదు ఈ సినిమాకి. పైగా చాలా చోట్ల షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి.
రెండో రోజు చాలా చోట్ల ‘లవ్ మౌళి’ ని రీప్లేస్ చేస్తున్నారు. కేవలం యూత్ ని దృష్టిలో పెట్టుకుని బెడ్ రూమ్ సీన్లు పెట్టేసుకుంటే.. అన్నీ ‘ఆర్.ఎక్స్.100’ లు , ‘బేబీ’ లు (Baby) అయిపోవు కదా.! సరైన విధంగా సినిమా కాన్సెప్ట్ ను జనాలకి చేరవేయాలి. ‘లవ్ మౌళి’ విషయంలో అది లోపించడం వల్లే.. మంచి టాక్ వచ్చినా మినిమమ్ ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు. నవదీప్ మాత్రమే కాదు రీ ఎంట్రీ ఇచ్చే ప్రతి హీరో దీన్ని క్షుణ్ణంగా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.