Naveen Polishetty : టాలీవుడ్‌లో యంగ్ హీరోలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి. మరోసారి తన కామెడీ టైమింగ్‌తో వార్తల్లో నిలిచారు. విభిన్న కథల్ని ఎంచుకుంటూ, సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నవీన్, వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రోజు’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లలోనూ చిత్ర బృందం కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వెళ్తోంది.
ఈ క్రమంలో “పెళ్లి రిసెప్షన్” అనే కాన్సెప్ట్‌తో నిర్వహించిన ఓ ప్రత్యేక ఈవెంట్‌లో నవీన్‌ను పెళ్లి గురించి ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం అక్కడున్నవారిని నవ్వుల్లో ముంచేసింది. “పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో… ఆ మరుసటి రోజే నా పెళ్లి !” అంటూ చమత్కారంగా సమాధానం ఇవ్వడంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉండగా, నవీన్ దాన్ని తనదైన శైలిలో ముడిపెట్టడం అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. ఆసక్తికరంగా, అనగనగా ఒక రాజు సినిమా కూడా పెళ్లి నేపథ్యంతో సాగుతుండటం విశేషం. ఈ చిత్రంలో నవీన్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించగా, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను రూపొందించారు. మొత్తానికి, పెళ్లి టాపిక్‌ని కూడా ప్రమోషన్‌గా మార్చేసిన నవీన్ పోలిశెట్టి స్టైల్ ని చూసి అందరు ఆశ్ఛర్యపోతున్నారు.
