కోలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నయనతార – విఘ్నేశ్ శివన్ ఒకేసారి లీగల్ ఇష్యూస్‌లో చిక్కుకున్నారు. విఘ్నేశ్ చేస్తున్న ‘ఎల్‌ఐసీ’ సినిమా మీద కేసు పడగా… ఇప్పుడు నయనతార చేసిన ‘అన్నపూరణి’ సినిమా కూడా న్యాయ చిక్కుల్లో పడింది. నయనతారపై తాజాగా ఓ కేసు నమోదైంది. ఆమె నుంచి ఇటీవల వచ్చిన ‘అన్నపూరణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనే సినిమా విషయంలో ఈ లీగల్ సమస్య వచ్చిపడింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు మత భావాలను కించపరిచేలా ఉన్నాయని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు.
‘అన్నపూరణి’ సినిమాలోని సన్నివేశాలు ‘లవ్ జిహాద్’ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ముంబయికి చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై విచారణ జరిపిన పోలీసులు… ఆ సినిమా ప్రధన తారాగణం నయనతార, జైతోపాటు దర్శకుడు నీలేశ్, నిర్మాతలు జతిన్ సేథీ, ఆర్ రవీంద్రన్, పునీత్ గోయెంకాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీంతో మొత్తంగా భార్యాభర్తలు ఒకేసారి లీగల్ సమస్యల్లో పడ్డట్టు అయ్యింది.
మరోవైపు ‘లవ్ టుడే’ సినిమా ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేశ్ శివన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘LIC’ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. LIC అంటే ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్’ అని అర్థం అని కూడా చెప్పారు. అయితే ఈ టైటిల్‌తో హర్ట్ అయిన LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆ సినిమా టీంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతోపాటు దర్శకుడు విఘ్నేశ్ శివన్‌కు నోటీసులు పంపింది.
ప్రజల్లో మంచి పేరు ఉన్న LICని ఇలా సినిమాల కోసం ఉపయోగిస్తే తమ సంస్థకు భంగం వాటిల్లుతుందని ఎల్‌ఐసీ నోటీసుల్లో పేర్కొంది. వారం రోజుల్లోగా సినిమా పేరు మార్చకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. అయితే ‘అన్నపూరణి’ సినిమా విడుదలకు ముందే రాష్ట్రీయ హిందూ మహాసభ రాష్ట్రీయ ప్రతినిధి ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కేసు పెట్టారు. అప్పుడేదో తేలిపోయింది అని అనకుంటే… ఇప్పుడు ఓటీటీలో విడుదలయిన తర్వాత కూడా మళ్లీ అదే సమస్య ఎదురవుతోంది.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!