తమిళ సినీ రంగంలో స్టార్ హీరోయిన్ నయనతార (Nayantara), ధనుష్ (Dhanush) మధ్య చెలరేగిన వివాదం కొత్త మలుపు తిరిగింది. నయనతార, విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) దంపతుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ విజువల్స్ అనుమతి లేకుండా వాడుకున్నారంటూ ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై నయనతార తాజాగా చేసిన పోస్టు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. నయన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “అబద్ధాలతో నాశనం చేయబోయే జీవితం అప్పు మాత్రమే.
Nayanthara
అది వడ్డీతో సహా తిరిగి వస్తుంది” అని కర్మ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ స్టన్నింగ్ కౌంటర్ ఇచ్చింది. ఎవరిపైనా ప్రత్యక్షంగా వ్యాఖ్య చేయకపోయినా, ఇది ధనుష్‌ను ఉద్దేశించినదేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇదిలా ఉంటే, ధనుష్ తరఫున వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులపై రూ.10 కోట్ల నష్టం పిర్యాదు చేశారు.
నయనతార, విఘ్నేష్ దంపతులు ఈ నోటీసుకు బహిరంగ లేఖ ద్వారా స్పందిస్తూ, మూడు సెకన్ల క్లిప్ కోసం ఇంత పెద్ద పరపతి డిమాండ్ చేయడం తగదని పేర్కొన్నారు. వారు వాడిన విజువల్స్ బీటీఎస్ కంటెంట్ మాత్రమేనని, సినిమా క్లిప్పింగ్స్ అనుకోవడం అసత్యమని నయన్ తరఫు లాయర్ రాహుల్ ధావన్ కోర్టుకు తెలిపారు. ఇంకా నయన్ ఈ వివాదం పట్ల తన అభిప్రాయాన్ని మరో లేఖలో పంచుకున్నారు. “మీ అభ్యంతరాలు కేవలం చట్టపరంగానే కాదు, నైతికంగా కూడా తప్పు” అని ధనుష్ తీరును తప్పుబట్టారు.
ఆమె వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసాయి. నయనతార (Nayanthara) ఈ లీగల్ పోరాటం ద్వారా ధనుష్‌కు మరింత కఠిన సమాధానం ఇవ్వనున్నారు. మరోవైపు, నయన్ ధనుష్ వివాదంపై కోర్టు డిసెంబర్ 2న విచారణ చేపట్టనుంది. ఈ కేసు ఎలా పరిష్కారమవుతుందో, ఇరువురు స్టార్ నటుల మధ్య సంబంధాలు మళ్లీ ఎలా మెరుగవుతాయో చూడాలి. ఈ వివాదం వల్ల నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీపై కూడా మరింత హైప్ క్రియేట్ అవుతోంది.