‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule) తెలుగు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి పుష్పరాజ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ప్రమోషన్లను నాన్ స్టాప్‌గా నిర్వహిస్తున్న మేకర్స్, ప్రతి ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరులో ప్రత్యేక ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రైట్స్‌కు భారీ డిమాండ్ ఉంది.
Pushpa 2
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఆంధ్రా ప్రాంతంలో రూ. 90 కోట్లు, నైజాంలో రూ. 100 కోట్లు, సీడెడ్‌లో రూ. 30 కోట్లకు రైట్స్ అమ్ముడు అయ్యాయి. అంటే, మొత్తం రూ. 220 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ షేర్ అందుకోవాలంటే ‘పుష్ప 2’ తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూ. 450 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) (415 కోట్లు)కి ఉన్నాయి.
‘బాహుబలి 2’ (Baahubali 2) (330 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో, ‘పుష్ప 2’కు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లను దాటడం అంత ఈజీ కాదు. ఇది సాధారణ టార్గెట్ కాదు. టికెట్ ధరలు పెంచినా, మొదటి రెండు వారాల్లో ఈ స్థాయి వసూళ్లు అందుకోవడం ట్రేడ్ పండితుల ప్రకారం చాలా కష్టమని చెబుతున్నారు. ‘పుష్ప 2’కు మంచి లాంగ్ రన్ అవసరం. సంక్రాంతి వరకు థియేటర్లలో నిలకడగా వసూళ్లు ఉంటే, ఈ టార్గెట్ సాధించగలదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మొదటి భాగంలో టికెట్ రేట్ల సమస్య వల్ల నష్టాలు జరిగినా, ఈసారి మేకర్స్ మరింత జాగ్రత్తగా ప్రణాళికలు వేశారు. ఇంకా ‘పుష్ప 2’లో (Pushpa 2) పాన్ ఇండియా మార్కెట్‌లోనూ పెద్ద హిట్ అవ్వాలని మేకర్స్ ఆశిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధిస్తే, ఇది అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్ రికార్డ్ గా నిలుస్తుంది. మరి ఈ అంచనాలకు తగిన రిజల్ట్ ఇస్తుందా అనే దానిపై ఇప్పుడు ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.