‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ నేపథ్యంలో మొదలైన పంచాయితీ ఇంత త్వరగా తేలేలా కనిపించడం లేదు నయనతార (Nayantara) లేఖతో మొదలైన ఈ పంచాయితీ.. ఇటీవల ధనుష్ (Dhanush) కోర్టులో దావా వేయడంతో మరింత ముదిరిపోయింది. ఇప్పుడు దానికి నయనతార తరఫున లాయర్ చేస్తున్న వాదన ఈ విషయంలో కొత్త చర్చకు దారి తీసింది. ఇది ఆఖరికి రచ్చ అయ్యేలా ఉంది అని అంటున్నారు. డాక్యమెంటరీలో తన సినిమా ‘నానుమ్ రౌడీథాన్’ సినిమాకు సంబంధించిన వీడియో ఫుటేజీని తన అనుమతి లేకుండా వాడుకున్నారు అని ధనుష్ ఇటీవల నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌పై (Vignesh Shivan) దావా వేసిన సంగతి తెలిసిందే.
Nayanthara , Dhanush:
దీనిపై నయనతార తరఫు లాయర్ స్పందిస్తూ ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. దీంతో ఈ దావా నిలవదు అని క్లారిటీ ఇచ్చేశారు. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో ఉపయోగించిన ‘నానుమ్ రౌడీ థాన్’ విజువల్స్ సినిమాలోవి కావు. అవి చిత్రీకరణ సమయంలో తీసిన సెట్స్‌లోని విజువల్స్.
వాటిని డాక్యుమెంటరీలో వాడుకోవడం ఉల్లంఘన కిందకు రాదు అని లాయర్ చెప్పారు. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 2న మద్రాసు హైకోర్టులో జరగనుంది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో వాడిన ‘నానుమ్ రౌడీ దాన్’కు ఫుటేజ్‌ను 24 గంటల్లో తొలగించాలని ధనుష్ డిమాండ్ చేశాడు. దీనిపై నయనతార బహిరంగ లేఖ రాశారు. మూడు సెకన్ల సీన్ వాడినందుకు పరిహారంగా ధనుష్ రూ.10 కోట్లు డిమాండ్ చేశారని ఆమె లేఖలో పేర్కొన్నారు.
దీంతో అసలు గొడవ మొదలైంది. అభిమానులు, నెటిజన్లు ఎవరికి నచ్చినవారివైపు వాళ్లు వచ్చారు. అడిగి తీసుకుంటే ధనుష్ ఇచ్చేవాడిగా, అడగకుండా తీసుకొని ఇప్పుడు రూల్స్ మాట్లాడుతున్నారు అని ధనుష్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే 3 సెకన్ల కోసం రూ. 10 కోట్లు ఇవ్వాలా అని నయన్ ఫ్యాన్స్ అంటున్నారు.